సీక్వెల్ సినిమాలే కాదు... ప్రీమేక్ సినిమాలు కూడా ఉంటాయి. హాలీవుడ్ లో ఆ తరహా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. కథని కొనసాగిస్తే సీక్వెల్ అవుతుంది. అలా కాకుండా ఆ కథకి ముందు ఏం జరిగిందన్నది చెబితే ప్రీక్వెల్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున తన సోగ్గాడే చిన్ని నాయనాకి ప్రీక్వెల్ కథని సిద్ధం చేయించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్మోహన్ చెప్పిన కథని అద్భుతంగా డీల్ చేసి కళ్యాణ్ కృష్ణ అనే ఓ కొత్త దర్శకుడు సోగ్గాడేని తెరకెక్కించాడు. ఆయన క్లారిటీకి ప్రేక్షకుల నుంచే కాకుండా పరిశ్రమ నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి. తెరపై బంగార్రాజు పాత్ర అద్భుతంగా పండింది.
అయితే ఆ పాత్రని అలా వదిలేయడం కాకుండా సీక్వెల్ గా మరో కథ తయారు చేయండని నాగార్జునకి పలువురు సలహా ఇచ్చారట. స్వతహాగా బంగార్రాజు పాత్ర అంటే నాగ్ కి కూడా చాలా ఇష్టం. పైగా అలాంటి పాత్రల్లో నటించడమంటే నాగ్ కి భలే సరదా అట. అందుకే ఇదే విషయాన్ని కథా రచయిత రామ్మోహన్ కి చెప్పాడట నాగ్. అయితే ఆయన బంగార్రాజు పాత్ర కోసమే అయితే `ఈ కథకి సీక్వెల్ కాకుండా... ప్రీక్వెల్ తయారు చేస్తేనే బాగుంటుంద`ని చెప్పాడట. నాగ్ కూడా అందుకు ఒప్పుకొన్నట్టు తెలిసింది. త్వరలోనే యంగ్ బంగార్రాజు తెరపై సందడి చేయొచ్చన్నమాట. మరి వయసులోని బంగార్రాజు ఇంకెన్ని సరసాలాడతాడో చూడాలి.