అక్కినేని కుటుంబంలో అందరూ సోగ్గాళ్లే. ఏఎన్నార్ మొదలుకొని నాగచైతన్య వరకు అందరూ అమ్మాయిల్ని అలరించినవాళ్లే. కథానాయికలతో మంచి కెమిస్ట్రీ పండిస్తుంటారు. నాగార్జున అయితే ఐదు పదుల వయసు దాటినప్పటికీ, ఇద్దరు కొడుకులు కథానాయకులైనప్పటికీ ఇంకా మన్మథుడు అనే ట్యాగ్ లైన్ తో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ ఆయనకి అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కథానాయికతో కలిసి ఓ రొమాంటిక్ సన్నివేశం చేశాడంటే నవతరం కథానాయకులు కూడా ఈర్ష్య పడాల్సిందేనేమో. తన గ్లామర్‌కి తగ్గట్టుగా `సోగ్గాడే చిన్ని నాయనా` అంటూ ఇప్పుడో సినిమా చేస్తున్నాడు. అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా నలుగురమ్మాయిలతో సందడి చేశాడు నాగ్. రమ్యకృష్ణ - లావణ్య త్రిఫాఠి - హంసానందిని - అనసూయ... ఇలా గ్లామరంతా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్లతో కలిసి చేసిన సన్నివేశాలకి సంబంధించి కొన్ని స్టిల్స్ ని నాగార్జున ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. అందులో నలుగురు హీరోయిన్లూ కనిపిస్తున్నారు. వాళ్లతో కలిసి నాగ్ చేసిన బోలెడంత అల్లరి చేసినట్టు అనిపిస్తోంది.
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాని కలర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం. మైసూర్ లో ఇటీవలే ఓ షెడ్యూల్ ని పూర్తి చేశాడు నాగ్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో ఆత్మగా - మరో పాత్రలో డాక్టర్ గా ఆయన వినోదాలు పంచబోతున్నాడట. ఈ సినిమాకి కొత్త కుర్రాడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరులోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. కథపై నమ్మకంతో నాగార్జున తన సొంత సంస్థలోనే ఈ సినిమాని తెరకెక్కించాడు. అనుకొన్నట్టుగా రావాలని ఒకట్రెండుసార్లు రీ షూట్ చేసినట్టు తెలిసింది.