అబ్బో.. కింగ్ మ‌ళ్లీ మ‌ళ్లీ త‌న వార‌సుల‌కి పోటీ వస్తున్నాడుగా..!

Update: 2021-03-13 23:30 GMT
'కింగ్' అక్కినేని నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వైవిధ్యమైన చిత్రాలు విలక్షమైన పాత్రల్లో నటిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. స్టార్ డైరెక్టర్స్ వెంట పరుగులు తీయకుండా ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నాడు నాగ్. ఇక 60 ఏళ్ళ వయసులో కూడా అందంలో ఫిజిక్ లో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. నాగ్ ప‌ని అయిపోయింద‌నుకున్న ప్ర‌తిసారీ ఏజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ త‌న సొంత కొడుకుల‌తోనే పోటీ ప‌డుతున్నాడు.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో అహిషోర్ సాల్మోన్ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు నాగ్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. ఎన్ఐఏ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నాగార్జున అదరగొట్టాడు. ఇందులో ఆయన భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. దీని తర్వాత నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఇటీవలే బాలీవుడ్ 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ పూర్తి చేశాడు. ఇలా హిట్లు ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా నాగ్ ఫుల్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు.

మ‌రోవైపున నాగార్జున వారసులు మాత్రం తండ్రితో పోటీ పడలేకపోతున్నారనే టాక్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ్ ఇద్దరు వార‌సుల్లో నాగ చైత‌న్య డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే చైతన్యకి వ‌చ్చిన స్టార్డ‌మ్ అంతా సతీమణి స‌మంత వ‌ల‌నే అనే టాక్ ఉంది. 'మజిలీ' 'వెంకీమామ' వంటి వరుస హిట్స్ అందుకున్న చైతూ.. ప్రస్తుతం నటిస్తున్న 'లవ్ స్టోరీ' 'థాంక్యూ' సినిమాలు కూడా హిట్ అయితే ఇంక తిరుగుండదని చెప్పవచ్చు. ఇక అఖిల్ విషయానికొస్తే సాలిడ్ హిట్ కోసం స్ట్ర‌గ‌ల్ అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్'.. దీని తర్వాత చేయబోయే సురేందర్ రెడ్డి సినిమా మీదనే అఖిల్ హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాలు హిట్ అయితే మాత్రం అఖిల్ కూడా ట్రాక్ లో పడినట్లే. మరి రాబోయే రోజుల్లో తండ్రికి పోటీనిస్తూ ఈ వారసులు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
Tags:    

Similar News