నన్ను ఇన్ వాల్వ్ చేయొద్దండి రావుగారూ... అంటూ `ఢీ` సినిమాలో మంచు విష్ణుని బ్రహ్మానందం ఎంతగా వేడుకొంటుంటాడనీ! ఆ సన్నివేశాలు చూస్తే చాలు... పడీ పడీ నవ్వుకుంటాం. అయితే ఇక్కడ కూడా ఒకాయన అవే మాటలన్నాడు. కానీ రావుగారు మాత్రం వదిలిపెట్టలేదు. ఇదిగో ఇలా ఇన్ వాల్వ్ చేసేశాడు. అయితే ఇక్కడ ఇన్ వాల్వ్ చేసింది బ్రహ్మానందంని కాదులెండి... డైరెక్టర్ నాగేశ్వరరెడ్డిని. మామూలుగా డైరెక్టర్ అంటే అక్కడెక్కడో మోనిటర్ దగ్గర మైకు పట్టుకొని కూర్చుంటుంటాడు. నాగేశ్వరరెడ్డి కూడా అంతే. ఇప్పటికే ఆయన చాలా సినిమాలు చేశాడు. కానీ ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు.
అందుకే ఆయనపై కన్నేశాడు మంచు విష్ణు. రాజ్ తరుణ్ కూడా అందుకు తనవంతుగా సాయం చేశాడు. వాళ్లిద్దరూ కలిసి నాగేశ్వరరెడ్డిని ఇదిగో ఇలా కెమెరా ముందుకు తీసుకొచ్చేశారు. అంతే కాదు... హీరోయిన్లతో కలిసి ఆడిపాడమంటూ బలవంతం చేశారు. దీంతో సెట్లో నవ్వుల పువ్వులు పూశాయి. మరి దర్శకుడు డ్యాన్సులేశాడో లేదో తెలియదు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు - రాజ్ తరుణ్ కథానాయకులుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికలుగా హెబ్బా పటేల్ - సోనారికా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకొన్న ఈ చిత్రాన్ని సమ్మర్ కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.