గెలిచేదెవరు.. డైరెక్టరా? పోలీసా?

Update: 2017-08-04 03:53 GMT
రెండు వారాల కిందట వచ్చిన ‘ఫిదా’ సినిమా రెండో వారాంతం అయ్యాక నెమ్మదించింది. గత వారం వచ్చిన ‘గౌతమ్ నంద’ బ్యాడ్ టాక్ తో మొదలై.. వీకెండ్ తర్వాత వీక్ అయిపోయింది. మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం కొంచెం డల్లుగానే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో శుక్రవారం ఒకటికి రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. అవి రెండూ పూర్తి భిన్నమైన సినిమాలు.

ఈ రెండు సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. కృష్ణవంశీ ‘నక్షత్రం’ గురించే. దశాబ్దం కిందట ‘చందమామ’తో హిట్టు కొట్టాక.. కృష్ణవంశీ సినిమాలేవీ కూడా సరిగా ఆడలేదు. ఉన్నంతలో ఆయన చివరగా తీసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ నయం. కానీ అందులో కృష్ణవంశీ మార్కు మిస్సయింది. ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో ‘నక్షత్రం’ తీశాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.మామూలుగా కృష్ణవంశీ సినిమాలంటే కంటెంట్ తోనే ఆకర్షిస్తాయి.  హీరోయిన్ల అందాల్నే నమ్ముకున్నట్లుగా ఉంది ఈ సినిమా ప్రోమోలవీ చూస్తే. మరి కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ పోలీస్ స్టోరీలో అంతకుమించి ఏమైనా విషయముందేమో చూడాలి.

ఇక ఈ వారం వస్తున్న మరో సినిమా ‘దర్శకుడు’. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కడే ఈ చిత్రానికి ఉన్న ప్రధాన ఆకర్షణ. సుక్కు మిత్రుడు జక్కా హరి ప్రసాద్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవతున్నాడు. సుకుమార్ అన్న కొడుకు అశోక్ హీరోగా.. ఈషా హీరోయిన్ గా నటించారు. దర్శకుడు కావాలనుకునే ఒక కుర్రాడి కథను.. ప్రేమకథ మిక్స్ చేసి చూపిస్తున్నారిందులో. తనకు తెలిసిన ప్రముఖుల సాయంతో ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేయించాడు సుకుమార్. మరి ఇందులోని కంటెంట్ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News