అర్జీవికి బిగ్ షాక్ .. మర్డర్‌ సినిమా నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు !

Update: 2020-08-24 11:30 GMT
సినిమాలు తీయడంలో అర్జీవిని మించిన వారు మరొకరు ఉండరు. సాధరణంగా ఎవరైనా కూడా సినిమా తీయాలనుకుంటే సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి సినిమా పూర్తి అయ్యి , థియేటర్స్ లోకి వచ్చే వరకు కొన్ని కోట్లు పెట్టి ప్రమోషన్స్ చేస్తారు కానీ , వర్మ మాత్రం సినిమా పేరుతోనే ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటాడు. అలాగే ఎక్కువగా నిజ సంఘటనలు సినిమాలుగా తెరకెక్కిస్తూ అందరిలో ఆసక్తిని పెంచుతుంటారు. ఇది వర్మ కి కొత్త కాదు కానీ , తాజాగా వర్మ తన కొత్త సినిమా విషయంలో షాక్ తగిలింది.

రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ ‘మర్డర్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే. దీనికి కుటుంబ కథా చిత్రమ్ అనే ట్యాగ్ ‌లైన్ కూడా పెట్టాడు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను… నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు పూర్తి చేసి కీలక తీర్పును ఇచ్చింది.మర్డర్‌ సినిమా నిలిపివేయాలని నల్గొండ జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిర్యాలగూడ అమృత, ప్రణయ్, మారుతీరావు ఘటనపై రామ్ గోపాల్ వర్మ చిత్రం చివరికి ఈ విధంగా ముగిసింది. కాగా,ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే విడుదలయిన విషయం తెలిసిందే. దీనితో పాటు రెండు పాటలు కూడా విడుదల చేశారు. అందులో ఓ పాటను స్వయంగా వర్మనే పాడారు. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.
Tags:    

Similar News