టాలీవుడ్ అగ్రహీరో, టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన సంవత్సర సందేశం ఇచ్చారు. ఈ సంవత్సరంలోనైనా కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడారు.
ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ తో మహమ్మారి మరో మారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత బాధ్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా చూడాలని సూచించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో క్యాన్సర్ వంటి వ్యాధితో బాధపడే వారికి హాస్పిటల్ లోనికి వచ్చినంతనే స్వాంతన కలిగించేలా చూస్తూ అవసరమైన వైద్యాన్ని అందించామన్నారు. ఈ కోవలోనే నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని సూచించారు.
నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలకు , అభిమానులకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా.. సంపదతో సరితూగాలని.. దాంతోపాటు ఆరోగ్యవంతులై సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఇక బసవతారకం ఆసుపత్రి సాధించిన విజయాలను వివరిస్తూ భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. వైద్యులు, మెడికల్ సిబ్బంది, పాల్గొని ఈ వేడుకను నిర్వహించారు.