నిన్నరాత్రి జరిగిన 'శ్యామ్ సింగ రాయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ .. "సాయిపల్లవి నుంచి మీరంతా డాన్స్ ఎంతలా ఆశిస్తారో నాకు తెలుసు. పల్లవి మైండ్ బ్లోయింగ్ గా చేసిన డాన్స్ ను మేము ఇంకా రిలీజ్ చేయలేదు. ఓ మూడు నాలుగు రోజుల్లో బయటికి రాబోతోంది. ఆ సాంగులో తాను పెర్ఫార్మ్ చేస్తుంటే నేను జనంలో నుంచుని ఆశ్చర్యపోతూ ఆమెను చూస్తుండిపోవాలి. ఆ సీన్లో నాకు నటించవలసిన అవసరం రాలేదు. తను డాన్స్ చేస్తుంటే నేను నిజంగానే ఆశ్చర్యంలో ఉండిపోయాను. ఆ పాటను కూడా శాస్త్రిగారే అద్భుతంగా రాశారు .. దేవి మీద పాట అది. ఆ తరువాత ఆయన చెప్పారు .. దగ్గరదగ్గర ఓ 45 రోజుల పాటు దేవి మీద ఉన్న పుస్తకాలన్నీ కూడా చదివి ఆ పాటను రాశారట.
ఈ సినిమాలో సాయిపల్లవి రోల్ కి ఉన్న డెప్త్ గానీ .. తాను చేసిన విధానం గాని ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఆమె పాత్రతో అందరూ లవ్ లో పడిపోతారు. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే, చేసింది ఒకటే సినిమా .. ఎలా ఉంటుంది .. కథను ఎలా అర్థం చేసుకుంటుంది .. అనే డౌట్లు వచ్చాయి. కానీ డే వన్ నుంచి ఆమె తన పాత్ర విషయంలో చాలా కేర్ తీసుకుంటూ వచ్చింది. వర్క్ ను మనసుకు దగ్గరగా పెట్టుకుని ఫాలో అవుతుందంటే, భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. కీర్తి అనే రోల్ ను ఆమె ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా ప్లే చేసింది. తనని కాకుండా ఆ పాత్రలో ఎవరినీ ఊహించలేరు.
ఫైనల్ గా చెప్పవలసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి. ఆయనంటే నాకు చాలా ఇష్టం .. నేను అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. అప్పుడప్పుడు నా సినిమాలు చూసి నాకు కాల్ చేసేవారు. 'ఒరేయ్ నాన్న నేను నీ ఒక్కడికే ఫ్యాన్ రా' అనేవారు. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. 'శ్యామ్ సింగ రాయ్'లో ఆయనకి కొన్ని పార్ట్స్ చూపించి పాట రాయమని చెప్పాము. ఆ తరువాత ఆయన నాకు కాల్ చేశారు. 'రెండు కళ్లు సరిపోవడం లేదురా .. ఎప్పుడెప్పుడు సినిమా మొత్తం చూస్తానా అని ఉంది' అన్నారు. అప్పుడే ఆయనకి ఈ సినిమా మొత్తం చూపించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది.
ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి. తెలుగు సినిమా ఉన్నంత కాలం .. సంగీతం ఉన్నంతకాలం ఆయనను మరచిపోలేము. ఇది గర్వించ వలసిన విషయమా .. ఆనందించవలసిన విషయమా .. బాధపడవలసిన విషయమా తెలియదు గాని, ఆయన ఆఖరు పాట 'శ్యామ్ సింగ రాయ్'లో ఉండటం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇంత ఎనర్జీని ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. రెండు సంవత్సరాల తరువాత థియటర్లకు వస్తున్నా .. నేను చాలా మిస్సయ్యాను .. మీరూ మిస్సయ్యారని తెలుసు. ఈ సారి మిస్సయ్యే ఛాన్సే లేదు. 24న టాప్ లేచిపోవాలంతే" అంటూ ముగించాడు.