బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి చెందినప్పటి నుండి కూడా రియా చక్రవర్తి పై జాతీయ మీడియా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆమె ఇంటి ముందు ఎప్పుడు పది లైవ్ వ్యాన్స్ ఉంటూనే ఉన్నాయి. ఆమె కోసం ఇంటి ముందు మీడియా పడిగాపులు కాసింది. ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్లినా లేదంటే ఎవరైనా బయటి నుండి లోనికి వెళ్లినా కూడా వారిని ఏదో ఒకటి మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు. సుశాంత్ మృతి కేసులో తాను పూర్తిగా సీబీఐ కి సహకరిస్తాను తనను మీడియా వేదిస్తుంది అంటూ సుప్రీం కోర్టుకు రియా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆమెను మీడియా వారు ఎంతగా ఇబ్బంది పెట్టి ఉంటారో ఊహించుకోవచ్చు. ఆమెకు సంబంధించిన అనేక వీడియోలు వాట్సప్ చాట్ లను తెప్పించుకునేందుకు మీడియా చాలా చాలా ప్రయత్నాలు చేసింది.
డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్ అయ్యింది. ఆమె అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆమె గురించి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఒక ఆన్ లైన్ సంస్థ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా గురించి ఎక్కువ వార్తలు వస్తున్నాయా సుశాంత్ మృతి గురించి ఎక్కువ వార్తలు వస్తున్నాయా అంటే 95 శాతం వార్తలు సుశాంత్ గురించే వస్తున్నట్లుగా వెళ్లడి అయ్యింది. రియా గురించి.. సుశాంత్ కుటుంబ సభ్యుల గురించి మరో వైపు కంగనా గురించి జాతయ మీడియాలో కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి.
అరెస్ట్ అయిన రియా బ్రేక్ ఫాస్ట్ గా ఏం తిన్నది అంటూ ఒక ప్రముఖ జాతీయ ఛానెల్ చేసిన కవరేజ్ ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతోంది. జాతీయ మీడియా మరీ ఇంతగా దిగజారి పోవడం ఏంటీ అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా జైల్లో ఉన్న రియా బ్రేక్ ఫాస్ట్ గురించి ఒక కథనంను ప్రసారం చేయడం సిగ్గు చేటు అంటూ సదరు మీడియా సంస్థపై విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ మృతి కేసులో హీరోయిన్ కాకుండా హీరో లేదా మరెవ్వరైనా ఉండి ఉంటే అప్పుడు మీడియా ఇంతగా ఉత్సాహం చూపించేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.