కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనీసం తినడానికి తిండి లేక నానా తిప్పలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో చిరంజీవి ఆధ్వర్యంలో ఒక సంస్థ ఏర్పడి సినీ కార్మికుల ఆకలి తీర్చుతున్న విషయం తెల్సిందే. చిరంజీవి సీసీసీ కోసం విరాళాలను ప్రత్యేకంగా ఫోన్ లు చేసి మరీ అడుగుతున్నట్లుగా ఆమద్య మీడియాలో వార్తలు వచ్చాయి.
హీరోయిన్స్ కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉంటారు. వారికి సామాజిక బాధ్యత లేదా.. వారు ఎందుకు విరాళాలు ఇవ్వడం లేదు అంటూ కొందరు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కాజల్.. తమన్నాలకు చిరంజీవి ఫోన్ చేసి విరాళం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట. చిరు స్వయంగా అడగడంతో కాజల్ రెండు లక్షలు.. తమన్నా మూడు లక్షల విరాళాలు ప్రకటించారు. విరాళాలు ఇచ్చి ఊరుకోవడమే కాకుండా తమకు తోచిన సాయంను చేసేందుకు ముందుకు వస్తున్నారు.
మాస్క్ లు అందిండచంతో పాటు.. ఫుడ్ ప్యాకెట్లు పంచి పెట్టించడం ఇంకా పలు కార్యక్రమాల్లో వీరు భాగస్వామ్యం అవుతున్నారు. వీరు ప్రస్తుతం చేస్తున్న పనికి అంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. చిరంజీవి వీరిలో సేవా గుణం తట్టి లేపారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి దారిలో వీరు నడవడం నిజంగా అభినందనీయం అంటూ నెట్టింట జనాలు అనుకుంటున్నారు.