రెండేళ్లుగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న నాగ చైతన్యకే కాదు అతని అభిమానులు సైతం చాలా పాజిటివ్ గా ఫీలవుతున్న మూవీ మజిలీ. వచ్చే నెల 5 విడుదలకు ఏర్పాట్లు ప్రకటనలు అన్ని జరిగిపోయాయి. అయితే ఇది చాలా ముందుగా ఫిక్స్ చేసుకున్న డేట్. తీరా ఇప్పుడు చూస్తే ఎన్నికల ప్రకటన తేదీ వచ్చేసింది. ఏప్రిల్ 11 దేశమంతా ఎన్నికల హడావిడి ఉంటుంది. దానికి కేవలం ఆరు రోజులు ముందు మాత్రమే మజిలీ రిలీజ్ ఉంది.
అయితే ఇక్కడో పెద్ద చిక్కు సమస్య ఉంటుంది. 5వ తేదీ నాటికి ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కి ఉంటుంది. రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ అనుచరులు బంధుగణం ఇలా అందరూ ఆయా ప్రచారాల్లో బిజీగా ఉంటారు. ప్రభుత్వ శాఖలకు సంబందించిన అధికారులు కనీసం సాయంత్రం ఇంటికి చేరుకోవడం కూడా అనుమానమే. అంత పని ఒత్తిడి ఉంటుంది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల సంగతి సరేసరి
వీళ్ళు కాకుండా సామాన్య జనంలో అధిక శాతం ఎన్నికల తాలూకు పరిణామాలు టీవీల ద్వారా ప్రత్యక్షంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆసక్తి చూపిస్తారు. థియేటర్ దాకా వెళ్లి సినిమాలు ఎందరు చూస్తారు అనేది అనుమానమే. మజిలీ ఓపెనింగ్స్ కి ఇవి ఖచ్చితంగా అడ్డంకులుగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పోనీ వాయిదా వేద్దాం అంటే ఒక అండర్ స్టాండింగ్ మీద అందరూ హీరోలు వరసగా ఏడు రోజులు గ్యాప్ ఇప్పటికే కర్చీఫ్ లు వేసుకున్నారు.
సో మజిలీకి వేరే ఆప్షన్ లేదు. జనాన్ని కాస్త ఎన్నికల మూడ్ లో బయటికి లాకొచ్చి సినిమా హాల్ దాకా రప్పించేలా చేయాలంటే మజిలీ టీమ్ అగ్రెసివ్ ప్రమోషన్ చేయక తప్పదు. ప్రచారాల హోరు మధ్య చైతు మజిలీ సౌండ్ గట్టిగా వినపడేలా చేయాలి. చూడాలి టీమ్ ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో