టాప్ స్టోరి: ఎన్నారై కిడ్స్ వైకుంఠ‌పాళి

Update: 2019-02-16 07:21 GMT
ఎన్నారైలు రంగుల క‌ల‌ల్లో మునిగి తేల్తున్నారా?  గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో పాము - నిచ్చెన ఆట‌లో పావుల‌వుతున్నారా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. అస‌లు స‌క్సెస‌వుతారా వీళ్లు? డ‌బ్బుంటే హీరోలేనా?   అనే సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. అస‌లు గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించ‌డానికి అర్హ‌త ఏమిటి? అంటే డ‌బ్బుంటే స‌రిపోద‌ని, బ్యాక్ గ్రౌండ్ .. ఫోర్ గ్రౌండ్ ఉన్నా అస్స‌లు ప‌న‌వ్వ‌ద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇక్క‌డ థియేట‌ర్ గ్యాంబ్లింగ్‌.. క‌మ్యూనికేష‌న్ గ్యాంబ్లింగ్.. డిస్ట్రిబ్యూష‌న్ గ్యాంబ్లింగ్ .. ఇన్ని విష‌యాలుంటాయి. సినిమా తీయ‌డం వీజీ.. రిలీజ్ చేయ‌డ‌మే క‌ష్టం. తెలిసీ తెలియ‌క అడుగులు వేస్తే ప‌త్తా లేకుండా వెళ్లిపోతార‌ని హెచ్చ‌రిస్తున్నారు. తెలియ‌కుండా వ‌స్తే అంతేగా అంతేగా!! అంటూ పంచ్ లు వేస్తున్నారు అనుభ‌వ‌జ్ఞులు. అస‌లు తెలుసుకునే వ‌స్తున్నారా?  తెలియ‌క‌నే వ‌చ్చి మూతి కాల్చుకుంటున్నారా? అంటూ ప్ర‌తిసారీ ఎన్నారైల‌పై సెటైర్లు ప‌డుతున్నాయ్. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నారైలు ఎవ‌రూ హీరోలుగా రాణించిందేం లేదు. ఎవ‌రైనా వ‌చ్చినా గోడ‌కు కొట్టిన బంతిలా ఇలా వ‌చ్చి అలా వెళ్లిన వారే. వీళ్ల‌లో ఎక్కువ‌గా వ‌న్ ఫిలిం వండ‌ర్ గా మొద‌టి సినిమాలో న‌టించి అలా వెళ్లిపోతున్న వాళ్లే ఎక్కువ‌గా ఉన్నార‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది.

వైజాగ్ స‌త్యానంద్ వ‌ద్ద‌ ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన హీరోలుగా రంగుల ప్ర‌పంచంలో మార్క్ వేయ‌గ‌ల‌రా? అంటే అదేమంత సులువు కాద‌ని ఇప్ప‌టికే ప్రూవైంది. ఆడియెన్ కి క‌నీసం ఉద‌య్ కిర‌ణ్ లా అయినా స్ట్రైక్ అవ్వాలి.. లేదంటే అంతేగా అంతేగా!!  అంటూ పెద‌వి విరిచేస్తున్నారు. మంచి క‌థ‌ - ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో తొలి ప్ర‌య‌త్నం హిట్టొచ్చినా .. ఆ త‌ర్వాత నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టం. ఇప్పుడున్న వారిలో ఎవ‌రు ఎన్నారై హీరో అని ప‌రిశీలిస్తే.. మ‌ల్టీట్యాలెంటెడ్ గయ్ అడివి శేష్ మాత్ర‌మే స‌క్సెస్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే అంద‌ని ద్రాక్ష లా ఆ స‌క్సెస్ ద‌క్క‌డానికి ప‌దేళ్లు ప‌ట్టింది. హీరోగా - డైరెక్ట‌ర్ గా - రైట‌ర్ గా ఇన్ని వేషాలు వేస్తే ద‌క్కిన స‌క్సెస్ ఇది.

హీరోలుగా ప‌రిచ‌యం అవుతున్న కొంద‌రు ఎన్నారైలు ఈ రంగంలో ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. ప‌క్కాగా ప్ర‌ణాళిక‌తో పాటు సినిమా స‌జావుగా రిలీజ‌య్యేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకోవ‌డం.. మీడియాతో స‌న్నిహితంగా స్నేహంగా మెల‌గ‌డం ఎంతో ఇంపార్టెంట్. నెగెటివిటీ రాజ్య‌మేలే  చోట పాజిటివిటీ నింప‌డంలో అడివి శేష్ లా రేర్ గా మాత్ర‌మే ఉన్నారు. గ‌తంలో ఎంద‌రో ఎన్నారైలు వ‌చ్చారు.. వెళ్లారు. `ఎన్నారై` టైటిల్‌ తోనే ఓ ఎన్నారై హీరో అయ్యాడు. అలా ఎంద‌రో వ‌చ్చారు.. ఆ త‌ర్వాత క‌నిపించ‌లేదు.. ఎన్నారై స‌న్స్ వ‌స్తుంటారు .. వెళుతుంటారు.. స‌ర‌దా తీరాక‌..!! అంతేగా అంతేగా!!!! అన్న సెటైర్లు ప‌డుతుంటాయ్. అంద‌రూ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి నానీలు, ర‌వితేజ‌లు కాలేరు. ఎన్నారై బ్యాక్ గ్రౌండ్ తో వ‌చ్చినా అడివి శేష్ లా ఎద‌గ‌లేరు.. అలాగ‌ని ప్ర‌య‌త్నించ‌క‌పోతే అది మ‌రీ పెద్ద త‌ప్పు.. ఇది వైకుంఠ పాళీ ఆట‌..  తెలివిగా ఆడాలి.. అంతేగా అంతేగా!!!

Tags:    

Similar News