ఒక సినిమా తియ్యలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధునిక యుగంలో మనిషి టెక్నాలజీని చాలా రకాలుగా యుస్ చేసుకుంటున్నాడు. ఒకరికి ఇది లాభాన్ని ఇస్తుంటే మరికొందరికి నష్టాన్ని ఇస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలపై టెక్నాలజీ ప్రభావం ఈ రోజుల్లో చాలా ఉందనే చెప్పాలి. కానీ కోట్లు పెట్టి తీసిన సినిమాను పైరేసి గా మార్చేసి కొందరు తీరని నష్టాన్ని కలుగజేస్తున్నారు. పైరేసి భూతం ఇప్పుడు ప్రతీ సినిమా పరిశ్రమలో ఉంది. ప్రతి సినిమాలోని సీన్స్ విడుదలైన నిమిషాలకే సోషల్ మీడియాలలో దర్శనం ఇస్తున్నాయి.
ఇప్పుడు అదే తరహాలో జైలవకుశ సినిమాకి కూడా పైరేసి దెయ్యం పట్టుకుంది. అభిమానులు సినీ పెద్దలు ఎన్ని సార్లు పైరేసిని పట్టించినా ఈ మయావి మాత్రం మాయమవ్వడం లేదు. ఈ రోజే విడుదలైన జై లవకుశ ఓవర్సీస్ లో ఒకరోజు ముందే ప్రదర్శించబడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఎవరు తీశారో గాని సినిమాలోని సీన్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ రోజుల్లో మొబైల్స్ వాడకం ఎక్కువగా ఉండడంతో ఈజీగా పైరేసికి ప్రాణం పోసినట్టవుతోంది. ఇప్పుడు జై లవకుశ లో అసలైన సీన్స్ బయటపడటంతో అభిమానులు మరియ చిత్ర యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్న ప్రతి ప్రమోషన్స్ లో పైరేసినీ ప్రోత్సహించడం మంచిది కాదని చాలా చెప్పారు. అయినా కూడా జై లవకుశ కి ఆ ఇబ్బంది తప్పలేదు. ఒకటి రెండు సైట్స్ లో ఉంటే ఏదో ఒక చర్యలు తీసుకోవచ్చు. కానీ వందల సైట్స్ లో పైరేసి వస్తుంటే ఏం చెయ్యగలరు. ఒక వేళ అప్పటికి చేసినా మళ్లీ నెక్స్ట్ రోజు మరో వందల సైట్స్ లో దర్శనం ఇస్తున్నాయి. ఫైనల్ గా పైరేసి దెయ్యాన్ని వదిలించాలంటే మరో కొత్త దేవుడి లాంటి టెక్నాలజీ రావాల్సిందే..అప్పటి వరకు ఈ భూతం వదలదు.