లైఫ్ అంటే ఇప్పుడిలా ఉండాలి. పదేళ్ల తర్వాత ఇంకోలా ఉండాలి. మనం ఏం చేయాలో.. ఎలా ఉండాలో.. ఏమి సాధించాలో ముందే కచ్చితంగా లెక్కలేసుకోవాలి. జీవితానికి సంబంధించి కొందరు చెప్పే మాటలివి. సినిమా ఇండస్ట్రీకొచ్చేసరికి ప్లానింగ్ అనే మాట కాస్త ఎక్కువగానే వినిపిస్తుంటుంది. కానీ ఈ మాటలేవీ తనకు సూటయ్యేవి కావంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జీవితం మనల్ని ఎలా నడిపిస్తే అలా ముందుకెళ్లిపోవడమే బాగుంటుందని అంటున్నాడు. అంతా మనం ప్లాన్ చేసుకునే జీవితం చప్పగా ఉంటుందని... లైఫ్ లో కిక్ మిస్సవుతామనేది ఎన్టీఆర్ ఫీలింగ్. తన జీవితంలో ఏది ఎలా ఉండాలనేది ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదనే చెబుతున్నాడు.
ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రిభియనం చేసిన జై లవకుశ 21న థియేటర్లకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు విపరీతమైన బజ్ వచ్చేసింది. దీనికితోడు ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలవకుశలో మూడు పాత్రలు తనకు బాగా నచ్చాయన్నాడు. కాకపోతే జై పాత్ర అంటే ఇంకాస్త ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆ పాత్ర చేయడానికి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చిందన్నాడు. టీజర్ రిలీజ్ చేసిసప్పటి నుంచి అభిమానులకు కూడా జై పాత్రే విపరీతంగా నచ్చింది. అభిమానులంతా కూడా ఆ పాత్రే దుమ్ము దులుపుతుందని బలంగా నమ్ముతున్నారు.
ఎన్టీఆర్ స్నేహితుడు - దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం సినిమా ఎప్పటికైనా తీసి తీరతాడని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఒకవేళ రాజమౌళి మహాభారతం సినిమా మొదలెడితే అందులో ఏ పాత్ర చేస్తారని ఎన్టీఆర్ ను అడిగితే ‘‘మన ఇతిహాసమైన భారతంలో ప్రతి పాత్ర నాకు నచ్చిందే. అందులో ఏ పాత్ర చేయమన్నా సంతోషమే. అందుకే రాజమౌళి మహాభారతంలో నాకు ఏ పాత్ర ఆఫర్ చేసినా చేయడానికి నేను రెడీ’’ అంటున్నాడు యంగ్ టైగర్.