ఇంకో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఎన్టీఆర్ మహానాయకుడు తెరమీద సందడి చేయబోతున్నాడు. సాధారణంగా బాలయ్య సినిమాలకు ఉండే భారీ ప్రీ రిలీజ్ హైప్ కనిపించడం లేదు కానీ నందమూరి అభిమానులు ఏదైనా అద్భుతం జరగకపోదా అనే నమ్మకంతో ఉన్నారు. కథానాయకుడు డిజాస్టర్ తాలూకు ప్రభావం తీవ్రంగా పడటంతో మహనాయకుడు ఓపెనింగ్స్ ఏ స్థాయిలో వస్తాయి అనేదాని మీద ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. కానీ షాక్ ఇచ్చే రీతిలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ ఏఎంబి సూపర్ ప్లెక్స్ లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మహానాయకుడు స్పెషల్ ప్రీమియర్ షో వేయటం అందరిని అవాక్కయ్యేలా చేసింది.
ఓవర్సీస్ లో ఓ నాలుగు గంటలు ముందుగా షోలు పడితేనే వాటి టాక్ పుణ్యమా అని ఇక్కడ వసూళ్లపై ప్రభావితం చెందుతున్న ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఏకంగా భాగ్యనగరంలో ముందు రోజు సాయంత్రం బెనిఫిట్ షో అంటే మాటలా. ఎలాగూ మీడియా ప్రతినిధులు వస్తారు. అభిమానులు సినిమా టీమ్ ఎందరు ఉన్నా టాక్ ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో ఇది ఒకరకంగా సాహసం అని చెప్పొచ్చు.
బాలయ్య క్రిష్ వ్యూహాత్మకంగా ఇలా ప్లాన్ చేసారా అనే డౌట్ రావడం సహజం. కథనాయకుడుకి భిన్నంగా ఇది ఖచ్చితంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది అనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. గత కొన్నేళ్లలో ఇలా ముందు రోజు సాయంత్రం బెనిఫిట్ షోలు వేసుకున్న స్టార్ హీరో సినిమా బాహుబలి 2 ఒకటే. అదేమైనా సెంటిమెంట్ గా ఫీలయ్యారేమో చూడాలి. ఇది బ్లాక్ బస్టర్ అయితే తప్ప మొదటిభాగం నష్టాల నుంచి ఎంతో కొంత కోలుకునే ఛాన్స్ లేని బయ్యర్లు సైతం రిజల్ట్ పట్ల టెన్షన్ గా ఉన్నారు. అన్ని సెంటర్లలో మొదటీ షో పడకముందే హైదరాబాద్ రిపోర్ట్ వచ్చేస్తుంది. దీని పరిణామాలు ఎలా ఉండొచ్చో రాత్రిలోపే తెలిసిపోతుంది కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ.