రీసెంట్ గా జరిగిన సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. పవన్ ని బన్నీ ఏమీ అనకపోయినా.. అసలు పవన్ గురించి మాట్లాడను అంటూ 'చెప్పను బ్రదర్' అన్నాడు. ఇదే పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించడానికి కారణమైంది. రీసెంట్ గా ఓ పబ్లిక్ పోస్టర్ లాంటిది డిజైన్ చేసి.. ఇన్ డైరెక్టుగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు.
చిరుకు పవన్ కళ్యాణ్ పెద్దకొడుకులాంటి చిన్న తమ్ముడు అని, అన్నయ్య ఇచ్చిన వారసత్వాన్ని పవన్ తన ప్రతిభతో విస్తరించాడని.. పవన్ అడుగే సంచలనం అని చాలానే మాటలు ఇందులో ఉన్నాయి. అయితే 'పవన్ ఓ శిఖరం.. ఆ శిఖరం గురించి మట్టిదిబ్బలు చెబితే ఏంటి? చెప్పకపోతే ఏంటి? ' అనే కామెంట్ మరీ టూమచ్ గా ఉంది. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన కామెంట్ కి ఇది కౌంటర్ అని అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా 'టన్నుల కొద్దీ ఉన్న దమ్మంతా పోయి.. దద్దమ్మలుగా మిగిలిపోతారు జాగ్రత్త' అనే హెచ్చరిక కూడా ఇందులో ఉంది.
చూడడానికి వార్నింగ్ లా అనిపిస్తున్నా.. చిరు - పవన్ లను వేరు చేయద్దంటూ అభిమానులు ఆవేదన చెందడాన్ని ఈ పోస్టర్ లో గమనించచ్చు. 'మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి పవన్ కళ్యాణ్ రెండు కళ్లు.. ఇందులో ఏ కన్నుకైనా అవమానం కానీ, అపాయం కానీ తలపెడితే తట్టుకోలేం' అని రాయడం చూస్తే.. చిరు గురించి మాట్లాడి, పవన్ గురించి చెప్పను అని చెప్పడంతో రగిలిన ఆవేదనగా అర్ధం చేసుకోవచ్చు. బన్నీ ఈ విషయాన్ని కూడా అర్ధం చేసుకుంటాడని ఆశిద్దాం!!