రవితేజను నేను గుర్తుంచుకున్నాను -పవన్

Update: 2018-05-10 18:12 GMT
రవితేజ నటించిన నేల టికెట్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను హైద్రాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా అటెండ్ అయ్యాడు. ఈవెంట్ జరిగినంత సేపు.. రవితేజతో ఎంతో సందడిగా కనిపించాడు పవన్.

మాస్ మహరాజ్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అందరినీ భలే ఉత్సాహపరిచాయి.' నేను యాక్టర్ కాకముందు.. రవితేజ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేయడం చూశాను. అన్నయ్య తర్వాత అంత దగ్గరగా చూసిన వ్యక్తి ఆయనే. ఆజ్ కా గూండారాజ్ ప్రివ్యూ థియేటర్లో రవితేజను నేను మొదటి సారి చూశాను. అప్పుడు నేను యాక్టర్ ను కాదు కాబట్టి నన్ను ఆయన గుర్తుంచుకోకపోయి ఉండవచ్చు. కానీ నేను గుర్తుంచుకున్నాను' అంటూ నవ్వులు పూయించాడు పవన్.

'ఆయన నవ్వుల వెనకాల.. పెర్ఫామెన్స్ వెనకాల.. చాలా కష్టం.. చాలా కృషి ఉన్నాయి. అంతే కాదు చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే.. గుండెల్లో ఎంతో కొంత ఆవేదన ఉంటుంది.అందుకే రవితేజ అంటే ఇష్టం. నటుడుగా ఎదుగుతున్న స్థాయి నుంచి చూశాను. ఎక్కడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఈ స్థాయిలో ఉన్న ఆయన్ని చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది' అన్నాడు పవన్.

'ఈయన ఇంత సిగ్గు లేకుండా ఎలా యాక్ట్ చేస్తాడని అనుకుంటూ ఉంటాను. నేనైతే అలా చేయలేను. తప్పని సరిగా పారిపోతాను. ఎంతమంది జనం ఉన్నా.. సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి వస్తాడు.. అందుకే తను నాకు ఇన్ స్పిరేషన్. దర్శకులు కళ్యాణ్ కృష్ణ గారికి.. హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మకు బ్రైట్ ఫ్యూచర్ అందాలని కోరుకుంటున్నాను.. జైహింద్' అంటూ తన స్పీచ్ ముగించాడు పవన్.
Tags:    

Similar News