కొన్ని నెలల క్రితం ప్రభాస్ తో సినిమాను చేయబోతున్నట్లుగా మహానటి మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సినిమాను 2021 ఆరంభంలో ప్రారంభించి 2022 సంవత్సరంలో విడుదల చేస్తామంటూ ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మహమ్మారి వైరస్ కారణంగా సినిమా ప్లానింగ్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి. దాంతో ఈ సినిమా కూడా విడుదల 2022 లో ఉండక పోవచ్చు అనుకుంటున్నారు.
ప్రభాస్.. రాధాకృష్ణ ల కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇంకా చాలానే ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయితే కానీ నాగ్ అశ్విన్ సినిమాను ప్రభాస్ మొదలు పెట్టె అవకాశం లేదనుకున్నారు. కనుక నాగ్ అశ్విన్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుటన్న నేపథ్యంలో వైజయంతి మూవీస్ వారు మాత్రం సినిమాను మొదట ప్రకటించినట్లుగా ఖచ్చితంగా 2022 సంవత్సరం చివరి వరకు విడుదల చేస్తామని ధీమాగా చెబుతున్నారు.
కాస్త ఆలస్యంగా షూటింగ్ ప్రారంభం అయినా కూడా సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం కాకుండా చేసుకుంటామని నాగ్ అశ్విన్ టీమ్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ప్రభాస్ సినిమా అంటే ఈ మధ్య కాలంలో అనుకున్న సమయం కు విడుదల అవ్వడం వీలు కాదు అన్నట్లుగా పరిస్థితి మారింది. మరి నాగ్ అశ్విన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తాడా చూడాలి.