ల‌వ్ యూ పెద‌నాన్న‌..గుండెల్లో ఉన్నారు! ప్ర‌భాస్

Update: 2022-09-29 11:35 GMT
పెద‌నాన్న..రెబల్ స్టార్  కృష్ణంరాజు అంటే?  డార్లింగ్ ప్ర‌భాస్ కి ఎంత అభిమాన‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న వార‌సత్వంతోనే  ప్ర‌భాస్ టాలీవుడ్ ఎంట్రీ జ‌రిగింది. నేడు పాన్ ఇండియా స్టార్ గా నీరాజ‌నాలు అందుకుంటున్నాడంటే?  దాని వెనుక కృష్ణంరాజు కృషి ఎంతో  ఉంది. ప్ర‌భాస్ తండ్రి నిర్మాత అయినా? ప్ర‌భాస్ ని స్టార్ గా మార్చింది మాత్రం రెబ‌ల్ స్టార్.

ఆయ‌న సూచ‌న‌లు..స‌ల‌హాలు పాటించే ఇంత‌టి వాడ‌య్యాడు. పెద‌నాన్న ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమాలు చేయాల‌నుకున్నారు. న‌టుడిగా దూరంగా ఉంటోన్న పెద్దాయ‌న‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించాల‌ని త‌పించారు. ఇద్ద‌రు క‌లిసి మ‌రెన్నో సినిమాలు చేయాల‌నుకున్నారు. కానీ కృష్ణంరాజు అకాల మ‌ర‌ణం అన్నింటిని దూరం చేసింది.

నేడు మొగ‌ల్తూరులో అభిమానుల స‌మ‌క్షంలో కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ  భారీ ఎత్తున నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భాస్ కూడా హాజ‌ర‌య్యారు  ముందుగా అభిమానుల‌కు అభివాదం చేసారు. ఈ సంద‌ర్భంగా పెద‌నాన్న ని త‌లుచుకుని క‌న్నీటి ప‌ర్యంతం చెందారు. పెద‌నాన్న‌పై త‌న ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు.

'ఐల‌వ్ యూ పెద‌నాన్న‌..  మీరు మాగుండెల్లో ఎప్పుడూ ఉంటారు. మీ జ్ఞాప‌కాలు ఎప్పుడూ ప‌దిల‌మే. మీరే మా స్ఫూర్తి. మీ అడుగు జాడ‌ల్లోనే'' న‌డుస్తానంటూ డార్లింగ్  పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం ఆ వ్యాఖ్య‌లు నెట్టింట  వైర‌ల్  గా మారాయి.

ప్ర‌భాస్-కృష్ణం రాజు క‌లిసిదిగిన పాత ఫోటోల్ని  అభిమానులు షేర్ చేస్తున్నారు. త‌మ డీపీలుగా పెట్టుకుని అభిమానం చాటుతున్నారు. సంస్మ‌ర‌ణ స‌భ సంద‌ర్భంగా దాదాపు ల‌క్ష మందికి  10 ర‌కాల వెజ్-నాన్ వెజ్ వంట‌కాల్ని వండిచిన‌ సంగ‌తి  తెలిసిందే. భోజ‌నాలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇక ప్ర‌భాస్ హీరోగా ప్ర‌స్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌ణ్ ఎంట‌ర్ టైన‌ర్ స‌లార్... నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్-కె చిత్రంలో న‌టిస్తున్నారు. కొన్ని రోజుల పాటు షూటింగ్ నుంచి విరామం  తీసుకున్న డార్లింగ్ ఇటీవ‌లే మ‌ళ్లీ షూట్ లో బిజీ అయ్యా డు. అయితే సంస్మ‌ర‌ణ స‌భ సంద‌ర్భంగా  రెండు రోజులు సెల‌వు ప్ర‌క‌టించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News