పాన్ ఇండియా సినిమాలో నటించడం అంటే సాహసంతో కూడుకున్న పనే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోకి క్రేజు ఉంటుంది. ఆ కోవలో చూస్తే ఒకసారి పాన్ ఇండియా రేంజులో సినిమా చేస్తే ఆ స్టార్ మళ్లీ మళ్లీ ఆ తరహా సినిమాలే చేయాల్సి ఉంటుంది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాలు ఎంచుకుని భారీ బడ్జెట్లతో భారీ కాన్వాసులో సినిమాలు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రభాస్ సన్నివేశం అదే. బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ క్రేజు ప్రస్తుతం స్కైలో ఉంది. బాహుబలి 1.. బాహుబలి 2 చిత్రాల తర్వాత సాహో లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించిన ఘనత ప్రభాస్ కి దక్కింది. ఈ సినిమా సౌత్ లో ఆశించినంత ఆడకపోయినా.. హిందీ పరిశ్రమలో బంపర్ హిట్టయ్యింది. దీంతో సాహో ప్రభావం ఇప్పుడు జాన్ పైనా పడిందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా జాన్ బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీకి వచ్చే పరిస్థితి లేదట. దాదాపు 150 కోట్లు పైగా బడ్జెట్ ని కేటాయించేందుకు యువి క్రియేషన్స్ - గోపి కృష్ణ మూవీస్ బ్యానర్లు సాహసిస్తున్నాయని తెలుస్తోంది.
జాన్ కోసం రామోజీ ఫిలింసిటీలో ఇప్పటికే భారీ సెట్లు వేశారు. యూరప్ తరహా సిటీని నిర్మించారు. వీటి కోసం భారీగానే ఖర్చవుతోందట. ఇక పీరియాడికల్ లవ్ స్టోరి కావడంతో నాటి వాతావరణం క్రియేట్ చేసేందుకు చాలానే ఎఫర్ట్ పెట్టాల్సి వస్తోందని సమాచారం. ప్రస్తుతం పూజా హెగ్డే సహా కీలక తారాగణంపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. అయితే ప్రభాస్ మాత్రం విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లారని ప్రచారమైంది. ఈ సినిమా ఎంతవరకూ తెరకెక్కింది? అంటే.. సాహో సెట్స్ పై ఉండగానే జాన్ కొంతభాగం తెరకెక్కింది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కలుపుకుని 30శాతం పైగా చిత్రీకరణ పూర్తయిందని చెబుతున్నారు. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజును దృష్టిలో పెట్టుకుని యువి క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నారని తెలుస్తోంది.