గత కొంతకాలంగా టాలీవుడ్ స్తబ్ధుగా ఉందేం అనుకున్నాం! థియేటర్ల మాఫియా, ఆ నలుగురు అన్న సౌండే లేదేంటో అనుకుంటే.. ఇంతలోనే నిశీధిని చీల్చుతూ థియేటర్ మాఫియాపై సైలెంట్ వార్ లా విరుచుకుపడ్డారు ఓ నలుగురు. అందుకు `పేట` హైదరాబాద్ ఈవెంట్ వేదికగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో రజనీ `పేట` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న అశోక్ వల్లభనేని నిన్నటి సాయంత్రం జరిగిన పేట ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నయీమ్ ని చంపారు కానీ, ఆ నలుగురిని షూట్ చేయాలంటూ.. నేరుగా కేసీఆర్, చంద్రబాబుకే సూచించి వాడి వేడిగా చర్చకు తెరలేపారు.
ఆయనొక్కరేనా? అనుకుంటే.. ఆయనకు తోడుగా నిర్మాతల మండలి మాజీ ప్రధానకార్యదర్శి ప్రసన్నకుమార్.టి సైతం నిప్పులు చెరిగారు. థియేటర్ మాఫియాని అడ్డుకోకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు. ఆ నలుగురిపై చెలరేగిన ఆయన.. టాలీవుడ్ లో మాఫియా డాన్ ల కన్నా దారుణాతి దారుణమైన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పేట వేడుకలో టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``నేడు థియేటర్ మాఫియా.. మాఫియా డాన్ ల కన్నా దారుణాతి దారుణంగా ఉంది. ముగ్గురు నలుగురు మాత్రమే వాళ్లు చేసే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సంక్రాంతికి ఆరు నుంచి ఏడు సినిమాలు విడుదలైన సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. చూడాలనుకునే ప్రేక్షకులు ఉన్నారు. అయితే కొన్ని ఏరియాల్లో కేవలం ఒకట్రెండు సినిమాలకే థియేటర్లను కేటాయించారు. అదొక మాఫియాలాగా తయారైంది. అలాంటి మాఫియా అంతమయ్యే పరిస్థితి వస్తుంది. టెక్నీషియన్లను వాళ్లు బతకనివ్వడం లేదు. కొత్త వాళ్లని రానిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో కేసీఆర్-కేటీఆర్ కి, ఆంధ్రలో చంద్రబాబునాయుడుకి చెప్తాం. మాఫియాకు కూడా కులం, మతం, ప్రాంతం లేదు. తెలంగాణ ఆయన తెలంగాణలోనూ, వైజాగ్ లోనూ మాఫియా చేస్తాడు. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగిలిన వాళ్లనే తొక్కేస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ల సినిమాలు మాత్రమే ఉండాలనుకోవడం మంచిది కాదు. దయచేసి మీరు విజ్ఞప్తి అనుకోండి.. రిక్వెస్ట్ అనుకోండి.. వార్నింగ్ అనుకోండి. చాలా మంది ఆకాశం నుంచి ఆకాశంలోకే పోయారు. మీరు కూడా పోతారమ్మా... కాస్త తెలుసుకుని పద్ధతిగా ఉండండి. ఇక సినిమా గురించి వస్తే ప్రతి సినిమా ఆడాలనే కోరుకుంటాం. కానీ ప్రేక్షకుడు బావున్న సినిమాలనే ఆడిస్తాడు. పదో తేదీ ఎన్టీఆర్ విడుదలైన తర్వాత నుంచి ఆ రెండే ఆడుతాయి. రజనీ రాఘవేంద్రస్వామి కాళ్లకు, బతికున్న ఎన్టీఆర్ కాళ్లకు మాత్రమే దణ్ణం పెట్టేవాడు. ఎన్టీఆర్ బయోపిక్ చరిత్ర సృష్టించడం ఖాయం. పేటా సైతం చరిత్ర సృష్టిస్తుంది. మిగిలిన వాళ్లు చూసుకోండి`` అని అన్నారు.
పందులే గుంపులుగా వస్తాయమ్మా.. సింహం సింగిల్‌గా వస్తుంది. మీ అరాచకాలను పైన దేవుడు చూస్తాడు. ఇకనైనా మనుషులుగా మారండి. ఈ 18వ తారీఖు తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, పేట మాత్రమే మిగులుతాయి అంటూ ప్రసన్నకుమార్ దుమారం రేపారు.