తొలి ప్రేమ.. ఈ టైటిల్ జనాలకు విపరీతంగా కనెక్ట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ అనేది ఒక కారణం అయితే.. ఇది ప్రతీ ఒక్కరికీ ఎదురయ్యే అనుభవం అనే విషయం మర్చిపోకూడదు. ఇప్పుడా టైటిల్ పై రూపొందిన సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా.. తన తొలిప్రేమ సంగతులు చెబుతోంది.
సహజంగా లవ్ ఎఫైర్స్ గురించి చెప్పేందుకు అమ్మాయిలు.. ముఖ్యంగా హీరోయిన్లు ఏ మాత్రం ఇష్టపడరు. కానీ ఇప్పుడీ పాయింట్ ను రివీల్ చేస్తే.. సినిమాకు కూడా బాగా ప్రచారం అవుతుంది. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే తన ఫస్ట్ లవ్ గురించి లీక్ చేసేసింది రాశి ఖన్నా. ఈమె 17 ఏళ్ల వయసులో ఉన్నపుడు.. కాలేజ్ లో ఓ సీనియర్ వచ్చి ప్రపోజ్ చేశాడట. అంతే అప్పుడు ఏం మాట్లాడలేకపోయిందట రాశి ఖన్నా. కానీ తొలిప్రేమ భావన ఎలా ఉంటుందో అనే సంగతి మాత్రం బాగా అర్ధమయిందని అంటోంది ఈ అందాల రాశి. అందుకే తొలిప్రేమ చిత్ర కథకు వెంటనే కనెక్ట్ అయిపోయినట్లుగా చెబుతోంది.
ఈ సినిమాలు మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్న రాశి ఖన్నా.. మొదటగా బరువు తగ్గి ఓ ఎపిసోడ్ చేసిందట. తర్వాత మళ్లీ కొంత బరువు పెరిగి కొంత భాగం షూటింగ్ జరుపగా.. మరోసారి ఐదు కేజీలకు పైగా బరువు తగ్గినట్లు వెల్లడించింది. ఇప్పుడు తన లుక్ అందరినీ నచ్చుతోందని.. ఇదే ఫిజిక్ ను కంటిన్యూ చేయడానికి కష్టపడతానని అభిమానులకు వాగ్దానం చేస్తోంది రాశి ఖన్నా.