నేనలా సెక్స్ చేయలేదు.. కాని సపోర్టు ఇస్తా

Update: 2017-10-21 09:24 GMT
హాలీవుడ్ లో జనాలను షేక్ చేస్తున్న హార్వే వీనిస్టీన్ అనే ప్రొడ్యూసర్ లైంగిక దాడుల ఉదంతం.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ కలకలం రేపుతోంది. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు దీని గురించి మాట్లాడటానికి సిద్దపడుతున్నారు. అయితే మనోళ్ళు ఓపెన్ గా పలానా వ్యక్తి నాకు ప్రపోజ్ చేశాడనో.. లేదంటే పలానా వ్యక్తి నన్ను బలాత్కరించాడనో మాత్రం చెప్పట్లేదు.

ఇలాంటి సెక్స్ ఆరోపణలకు ఎప్పుడూ రెడీగా ఉండే.. రాధికా ఆప్టే ఉంది చూశారు.. అమ్మడు ముంబాయ్ లో జరుగుతున్న మామి ఫెస్టివల్ లో ఈ అంశంపై మాట్లాడింది. #MeToo అంటూ సాగుతున్న క్యాంపెయిన్ కు మద్దతిస్తున్నా అంటూ అమ్మడు ఏం చెప్పిందంటే.. ''నాకెప్పుడు అలాంటి సిట్యుయేషన్ తారసపడలేదు.. అలాంటి బలవంతపు సెక్స్ నేను చేయలేదు కాని.. అలాంటివి చాలా విన్నాను. చదివాను. అయితే బాలీవుడ్ లో కూడా అలాంటివి ఉన్నాయి అంటే ఆశ్చర్యపోతున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ #MeToo క్యాంపెయిన్ వలన చాలామంది ఓపెన్ అవుతున్నందుకు'' సంతోషంగా ఉంది అని చెప్పింది రాధికా ఆప్టే.

రక్తచరిత్ర.. లెజెండ్ వంటి సినిమాల్లో నటించి తెలుగు వారికి సుపరిచితమైన ఈ సుందరి.. గతంలో సౌత్ ఇండియాలో నన్ను రూమ్ కు రమ్మని చాలామంది ప్రొడ్యూసర్లు బలవంతం చేశారు అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ విషయాలను మాత్రం అమ్మడు ఇప్పుడు చెప్పలేదు.
Tags:    

Similar News