వామ్మో.. దర్శక కేంద్రుడు సామాన్యుడు కాదు

Update: 2016-06-20 10:14 GMT
సౌందర్య లహరి అంటూ ఓ ధారా వాహికను కొనసాగించడానికి నోరు విప్పిన ఈ మౌన ముని.. ఇప్పుడు ఏ స్టేజ్ ఎక్కినా.. మాటలతో అక్కడున్న వారందరినీ ఆకర్షిస్తున్నాడు. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగుల విషయంలోగానీ.. హీరోయిన్ల సౌందర్యం గురించి గానీ దర్శక కేంద్రుడు మాట్లాడితే.. అక్కడ ఆసీనులైన వారంతా గొల్లున నవ్వాల్సిందే. తాజగా దర్శక ధీరుడు యస్.యస్.రాజమౌళి కజన్ ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో తెరకెక్కిన ‘షో టైమ్’ చిత్రం టీజర్ లాంచింగ్ కు ముఖ్య అతిథిగా ఈ దర్శక కేంద్రుడు హాజరయ్యాడు. ఆయనతో పాటు రాజమౌళి - యం.యం.కీరవాణితో పాటు ఇతర రాజమౌళి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాంకరింగ్ చేసిన అదిరే అభి... వీరందరినీ.. మీరు సినిమాకు ఎందుకు వెళతారు? అంటూ ప్రశ్నించి సమాధానాలు రాబట్టాడు. అయితే రాఘవేంద్రరావును మాత్రం ప్రశ్నించలేదు. దాంతో స్టేజ్ ఎక్కి.. ఎందుకు అభి నన్ను ఒక్క క్వశ్చన్ అడగలేదు అన్నాడు. సార్.. మిమ్మల్ని ఏమి అడిగితే ఏం సమాధానం ఇస్తారో అనే భయం వేసి అడగలేదు అన్నాడు. సార్.. ఇప్పుడు అడుగుతున్నా మీరు సినిమా థియేటర్ కు ఎందుకు వెళతారు అన్నాడు? దాంతో రాఘవేంద్రరావు... నేను సినిమాకు వెళితే హీరోయిన్ ను చూస్తా అన్నాడు. వెంటనే అభి అందుకుని.. సార్ మీకు అక్కడ యాపిల్స్ ఏమైనా కనిపిస్తాయా అన్నాడు. ఇక దర్శకేంద్రుడు తనదైన స్టైల్లో ఎవరి యాపిల్స్ వారి వద్ద వుంటాయి. వాటిని నేనేందుకు చూస్తా. నా యాపిల్స్ మాత్రం ఇంట్లో వుంటాయి. వాటినే చూస్తా అని సమాధానం ఇవ్వడంతో అక్కడున్న వారంతా.. వామ్మో.. దర్శకేంద్రుడు సామాన్యుడు కాదనుకున్నారు.

ఇప్పటి వరకు కేవలం సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించిన ఎస్.ఎస్. కాంచి.. తొలిసారిగా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. కాంచి మా ఇంట్లో అందరికంటే తెలివైన వాడు. అతనికి తెలియనిదంటూ వుండదు. ఆయన ఓ ఎన్ సైక్లోపిడియా అంటూ కితాబిచ్చాడు. ఇంకా మాట్లాడుతూ.. తనకు హీరో కావాలని మొదట్లో వుండేదని.. అయితే సినిమాల్లోకి ఎలా రావాలో తెలియక పల్లెలో పూజలు చేసుకుంటూ వుండే వాణ్నని.. అయితే ఓ రోజు నువ్వు ఏమవుతావని అడిగితే హీరో అవుతానని చెప్పానని.. మరి నువ్వు పల్లెలో వుంటూ హీరో అవుతానంటే ఎలా.. వచ్చేయ్ అనడంతో.. వెంటనే మద్రాస్ వెళ్లిపోయి సినిమా ఇండస్ట్రీకి దగ్గరయ్యా. అలా నన్ను సినిమా రంగం వైపు రావడానికి ప్రోత్సహించిన కాంచి తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నాడు. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. శ్రీజాన్ సుధీర్ పూదోట నిర్మాత. రణ్ ధీర్ - రుక్సార్ మీర్ జంటగా నటించారు.
Tags:    

Similar News