మామూలుగా అందరూ గురువుల్ని ఫాలో అయ్యి గొప్ప గొప్ప దర్శకులు అయిపోతుంటారు. దాసరి నారాయణరావును ఫాలో అయిన ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ కూడా సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిపించుకోవడమే కాదు.. ఆయన కూడా 100కు పైగా సినిమాలను తీశాడు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర పనిచేసిన రాజమౌళి కూడా.. ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.
ఎంత పెద్ద పొజిషన్ కు వచ్చినప్పటికీ ఇంకా గురువులను టిప్స్ అడిగే నాదులు ఉన్న ఈరోజుల్లో.. రాఘవేంద్రరావు మాత్రం తన శిష్యుడ్ని ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు తెలుసా. ఆన్ లైన్ లో దర్శకత్వంపై క్లాసులు చెబుతున్న ఈయన.. ఇప్పుడు అక్కినేని నాగార్జునతో ''ఓం నమో వేంకటేశాయ'' సినిమా కోసం రాజమౌళి తరహా ప్లానింగ్ ఫాలో అవుతున్నారు. ఎక్కడా? షూటింగులో కాదులే.. ప్రమోటింగ్ లో. ఎంత నాగార్జున ఉన్పప్పటికీ ఈ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ అవసరం. అందుకే ఇప్పటి నుండే హైప్ క్రియేట్ చేయడానికి.. బాహుబలి సినిమా రిలీజ్ టైములో ఎలాగైతే మూడు రోజులకు ఒక క్యారెక్టర్ లుక్ విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారో.. ఇప్పుడు రాఘవేంద్రరావు కూడా అదే ఫాలో అవుతున్నారు.
మొన్ననే లోగో రిలీజ్ చేశారు. తరువాత లోగో టీజర్ అన్నారు. మరుసటి రోజు విష్ణు మూర్తి పాత్రధారి సౌరభ్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అనుష్క సన్యాసిని లుక్ అంటున్నారు. ఆ తరువాత ప్రగ్యా జైస్వాల్ లుక్. ఇలా చేసుకుంటూ పోతూ సినిమాపై ఒక రేంజ్ ఎక్స్ పెక్టేషన్లను పెంచాలనేది ఆయన ప్లాన్ అని తెలుస్తోంది. బాగుంది కదూ.