టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కే. రాఘవేంద్రరావు. ఇప్పుడంటే భక్తి చిత్రాలు తీస్తారు కానీ.. ఓ దశాబ్దం ముందు వరకూ రక్తికి కేరాఫ్ అడ్రస్ - బ్లాక్ బస్టర్ లకు మారుపేరు, స్టార్ హీరోలకు సెంటిమెంట్.. ఇలా ఉండేవి ఆయన మారు పేర్లు. అంతే కాదు.. రాఘవేంద్ర రావు సినిమాలో నటించడమంటే.. తమ అందం పది రెట్లు పెరిగి జనాలకు కనిపిస్తుందని పాత కొత్త హీరోయిన్లు అందరూ నమ్మేవారు.
మరి అలాంటి దర్శకేంద్రుడు సినిమాలు తీయడంలో మెళకువలు నేర్పిస్తే ఎలా ఉంటుందియ? రాఘవేంద్రరావు శిష్యరికం అంటే మామూలు విషయం కాదు. ఓ రాజమౌళి కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన శిష్యుడే. ఇప్పుడు తనే కేఆర్ ఆర్ క్లాస్ రూమ్ అంటూ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు రాఘవేంద్రరావు. సినిమా తయారీలో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం కేఆర్ ఆర్ క్లాస్ రూమ్ ఉద్దేశ్యం. దీనికి సంబంధించి ఓ చిన్న యాడ్ తన మీదే రూపొందించి, తనే నటించి, నెట్ లో పెట్టారు రాఘవేంద్రరావు. చివర్లో వాచ్ ఫర్ డీటైల్స్ అంటూ టీజర్ రేంజ్ లో ఊరించారాయన.
మరి ఈ క్లాస్ రూం గురించి మరిన్ని సంగతులు అయితే.. ఆయనే చెప్పాలి. కానీ అంతటి దిగ్గజ దర్శకుడి దగ్గర నుంచి ఫిలిం మేకింగ్ లో శిక్షణ పొందేందుకు ఇప్పుడు చాలామంది ఔత్సాహికులు రెడీ అయిపోతున్నారు.