అక్కినేని నాగార్జునను చూస్తే చాలా మోడర్న్ గా స్టైలిష్ గా కనిపిస్తాడు. అలాంటి వాడు అన్నమయ్య సినిమా చేస్తున్నాడంటే అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. నాగార్జునకు ఇలాంటి భక్తుడి పాత్ర ఏమాత్రం సూటవ్వదని.. ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగల్చడం ఖాయమని కొందరు అంచనా వేశారు. ఈ పాత్ర మీద ప్రేమతో ఎంతో నిష్టగా ఈ సినిమా చేశాడు నాగ్. దానికి మంచి ఫలితమే దక్కింది. ఆ తర్వాత రామదాసు.. షిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాల్లో నటించిన నాగ్.. తాజాగా హథీరాం బాబా జీవిత కథతో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో నాగార్జునతో పాటు యూనిట్ సభ్యులందరూ మరింత నిష్టగా వ్యవహరిస్తున్నారట.
కొన్ని రోజుల కిందటే అన్నపూర్ణ స్టూడియోలో ‘ఓం నమో వెంకటేశాయ’ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి ఈ సెట్లో ఎవ్వరూ చెప్పులు వాడకూడదట. సెల్ ఫోన్ సహా ఏ ఎలక్ట్రానిక్ పరికరమూ ఉపయోగించకూడదట. స్నానం చేసే రావాలి. శుభ్రంగా ఉండాలి. తెల్లటి బట్టలే ధరించాలి. మగాళ్లయితే కుర్తా పైజామానే వేసుకోవాలి. నెత్తిన నిలువు బొట్టు తప్పనిసరి. ఇలాంటి నిబంధనల మధ్య షూటింగ్ చేస్తున్నాడట రాఘవేంద్రరావు. ప్రస్తుతం ఆయన టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. చాన్నాళ్ల విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న రాఘవేంద్రరావు.. ‘ఓం నమో వెంకటేశాయ’ను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకే ఇంత నిష్టతో సినిమాను పూర్తి చేస్తున్నారు.