కుక్క‌కి గ‌బ్బ‌ర్ అని పేరెట్టింది

Update: 2015-10-05 19:25 GMT
ఓ కుక్క‌పిల్ల సినిమా సెట్‌లోకొచ్చింది. కుయ్ కుయ్ మ‌ని మొరిగింది. పైగా ఆ మొరుగుడు ఎక్క‌డ‌నుకున్నారు.. ఓ హాట్ గాళ్ ముందు.. ఇంకేం ఉంది.. వెంట‌నే ఓ హ‌గ్ దొరికింది. నులివెచ్చ‌ని కౌగిలి లో బిగి బిగి వెచ్చ‌ద‌నాన్ని ఆ కుక్క పిల్ల తెగ ఆస్వాదించేసింది. అంతేనా.. అక్క‌డి తో త‌న ప‌ని అయిపోలేదు.

అమ్మ నాన్న ఎవ‌రో తెలియ‌ని ఈలోకం లో త‌న‌కి పేరు ఎవ‌రు పెడ‌తారు? అని మ‌రోసారి కుయ్ మంది. దాంతో వెంట‌నే ఆ బ్యూటీ ఎంతో జాలి ప‌డిపోయి.. ఆ కుక్క‌కి ఏమ‌ని పేరు పెట్టేసిందో తెలుసా? ముద్దుగా గ‌బ్బ‌ర్ అని నామ‌క‌ర‌ణం చేసేసింది. పైగా ఈ చోద్యం అంతా ఎక్క‌డ జ‌రిగింద‌నుకుంటున్నారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సెట్స్‌లో. అయితే మ‌రీ ఈ హాట్ గాళ్ (ల‌క్ష్మిరాయ్‌) ఇలా ఓ కుక్క‌కి గ‌బ్బ‌ర్ అని డేరింగ్‌గా పేరెట్టేసింది. అట్నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్ హ‌ర్ట‌వుతార‌న్న భ‌యం కూడా లేకుండా ఇలా ఎలా పేరెట్టిసిందో.. మొత్తానికైతే కుక్క పిల్ల మ‌న‌సు దోచింది. త‌న‌కి ఎంతో స‌న్నిహితం అయిపోయింది. అందాల భామ‌ తో ఆకులో వ‌క్క‌లా క‌లిసిపోయింది.

కాని.. పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు ఈ విషయంలో హర్టయ్యారు కూడా.. అసలు పవన్‌ కళ్యాన్‌ కెరియర్‌ లోనే టర్నింగ్‌ పాయింట్‌ అయిన 'గబ్బర్‌' అనే పేరును కుక్కకు పెడుతుందా ఈవిడ అంటూ రుసరుసలాడుతున్నారు.
Tags:    

Similar News