హాలీవుడ్ రాయల్ లుక్ లో జక్కన్న!
దర్శకదీరుడు రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెల్లగా వ్యాపిస్తుంది. మగధీర నుంచి ఆయన రేంజ్ ఇండియాలో మెల్లగా పెరిగింది. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచం నలుమూలల ఆయన సినిమాలు ఇప్పుడు మరింత క్రేజ్ అందుకుంటున్నాయి. స్పెషల్ షోలు వేయించి మరి రాజమౌళిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అయితే త్వరలోనే రాజమౌళి హాలీవుడ్ రెడ్ కార్పెట్ మీద నడిచిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
ఇక రీసెంట్ గా ఆయన లాస్ ఏంజిల్స్ లో జరిగిన 13వ వార్షిక గవర్నర్స్ అవార్డ్స్ ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకకు అతికొద్ది మంది ఇండియన్ సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించగా అందులో రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నల్ల సూట్ ధరించి కనిపించిన జక్కన్న హాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించారు.
ఈ కార్యక్రమానికి పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా హాజరయ్యారు. తరువాత ఈ స్టార్ డైరెక్టర్ కుమారుడు కార్తికేయ తన సోషల్ ప్రొఫైల్ లో బ్లాక్ సూట్‌లో రాయల్‌గా కనిపించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా హాలీవుడ్ రేంజ్ లోనే ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం కథ చర్చలు కొనసాగుతున్నాయని పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేసేందుకు తన టీం తో కలిసే పని చేస్తున్నట్టుగా రాజమౌళి వివరణ ఇచ్చారు. దాదాపు మెయిన్ స్టోరీ లైక్ అయితే పూర్తయింది కానీ పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావాల్సి ఉంది. ఇక ఆ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన 28వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమా 2023 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.