ఫోటో స్టొరీ: హాట్ బ్యూటీ గాల్లో యోగాససనాలు

Update: 2019-06-21 11:49 GMT
గ్లామర్ ను మెయింటెయిన్ చెయ్యాలంటే సరైన ఆహారం తీసుకోవడమే కాదు.. ఖచ్చితంగా ఎక్సర్ సైజ్ చెయ్యాలి. చెయ్యక తప్పదు. గ్లామర్ ఇండస్ట్రీ అయిన ఫిలిం సెలబ్రిటీలకు ఫిట్నెస్ చాలా ముఖ్యం.  అందుకే మెజారిటీ సెలబ్రిటీలు జిమ్ బాట పడతారు.. కొందరైతే యోగా చేస్తారు. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు యోగా గురించి యోగాతో తమకున్న అనుబంధం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.  బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే పని చేసింది.

రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  అందులో ఒక వేలాడే తాడు లాంటి వస్త్రం సహాయంతో గాల్లో తేలుతూ వివిధరకాల యోగాసనాలు చేసింది. కొన్ని యోగాసనాలు సులువుగా చేసేందుకు.. సపోర్ట్ గా ఈ క్లాత్ ఉపయోగపడుతుంది. ఈ ఫోటోలకు "హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. నేను అనుష్క పర్వాని గారి యోగా క్లాస్ కు హాజరైనంత వరకూ నేను యోగా చేసేదాన్ని కాదు.  ఇప్పుడు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటే నా ప్రపంచం పర్ఫెక్ట్ గా ఉంది.  మనసులో శాంతి.. సంతోషం.. గాయాల నుండి ఉపశమనం కూడా లభిస్తున్నాయి. అనుష్కగారు.. నన్ను యోగా అడిక్ట్ గా మార్చినందుకు థ్యాంక్ యూ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక రకుల్ ఫోటోలు చూస్తేనే ఏ రేంజ్ లో యోగాసనాలు వేస్తుందో మనకు అర్థం అవుతుంది.  ఈ ఫోటోలకు కామెంట్లు కూడా భారీ రేంజ్ లో వచ్చాయి.  "యోగా పేరుతో స్టంట్లు చేస్తున్నావే".. "యోగా డే బ్యూటీ హంగామా".. "నువ్వు హీరోయిన్ వా యోగా టీచర్ వా".."ఒక్క ఫోటోలో కూడా చక్కగా నిలబడలేదు"  అంటూ కామెంట్లు పెట్టారు. ఏదైతేనేం.. రకుల్ కూడా యోగా స్పెషలిస్ట్ అని అందరికీ అర్థం అయిపోయింది.
Tags:    

Similar News