చరణ్ చెప్పగానే సపోర్ట్ చేశారు

Update: 2018-01-19 11:13 GMT
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సినిమా షూటింగ్ ఎక్కువగా ఆంద్రప్రదేశ్ పరిసర ప్రాంతాలోనే జరిగింది. దర్శకుడు సుకుమార్ మొత్తం సెట్స్ లలో అలాగే న్యాచురల్ లొకేషన్స్ లో సినిమా షూటింగ్ ను జరిపాడు.

అయితే షూటింగ్స్ సమయంలో చాలా మంది ప్రజలు వీక్షించడానికి వచ్చేవారు. చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం స్పెషల్ సెక్యురిటీ ని ఏర్పాటు చేసుకుంది. ఇక అభిమానులు ఎవరైనా వస్తే రామ్ చరణ్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారిని కలిసేవాడు. ఇకపోతే రీసెంట్ గా గోదావరి దగ్గర ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని తెలిసి అక్కడికి భారీగా జనం తరలివచ్చారు. దీంతో షూటింగ్ జరుగుతుందా లేదా అని అందరు అనుకున్నారు.

అయితే అక్కడ జనాన్ని రామ్ చరణ్ చూసి ఎంతో ఆప్యాయంగా వారికి నమస్కారం చేశాడు. అనంతరం వారిని కొంచెం రిక్వెస్ట్ చేయగా షూటింగ్ చేయడానికి కొంచెం అనుకూలంగా మారింది. చరణ్ చెప్పగానే అక్కడి వారందరు సపోర్ట్ చేశారు. ఇక సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా దర్శకుడు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. కేవలం ఈ ఒక్క సాంగ్ మిగిలి ఉందట. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News