చ‌ర‌ణ్ ప్లాన్ -బి ఎందుకు?

Update: 2018-08-22 16:30 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా-న‌ర‌సింహారెడ్డి` టీజ‌ర్ బ‌ర్త్‌ డే కానుక‌గా రిలీజై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ 24 గంట‌ల్లో కోటి వ్యూస్‌ ని అందుకుని రెండు కోట్ల వ్యూస్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. మెగా ఫ్యాన్స్ స‌హా ఫిలింసర్కిల్స్‌ నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ టీజ‌ర్ త‌ర్వాత బిజినెస్ వ‌ర్గాల నుంచి స్పంద‌న ఎలా ఉంటుందా? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే చ‌ర‌ణ్ వ్య‌వ‌హార శైలి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిన్న‌టిరోజున సైరా ఈవెంట్‌లో బాలీవుడ్ రిలీజ్‌ పై అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ .. అన్ని సౌత్ భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నామ‌ని తెలిపారు. అంటే ఉత్త‌రాదిన ఈ సినిమా రిలీజ్ గురించి చ‌ర‌ణ్ మైండ్‌ లో బ్లాంక్ స్పేస్ అలానే ఉంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. కేవ‌లం సౌత్ ఆడియెన్‌కి సూట‌య్యే క‌థాంశంతోనే ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్నాం అన్న అర్థం స్ఫురించింది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్ ల‌ను మాత్ర‌మే రిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌నో ఏమో ఈ సినిమాకి బాలీవుడ్ బిజినెస్ స‌ర్కిల్స్ నుంచి స‌రైన స్పంద‌న లేదు. అందుకే చ‌ర‌ణ్ ఆలోచ‌న మార్చుకున్నారా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. అయితే టీజ‌ర్ రిలీజై ఇంకా రెండురోజులైనా కాలేదు. అప్పుడే సైరా-  ఇరుగుపొరుగు భాష‌ల బిజినెస్‌ - రిలీజ్ గురించి మాట్లాడ‌డం కాస్తంత అతిశ‌యోక్తి అనే చెప్పాలి. ఇక‌పై అయినా బాలీవుడ్ నుంచి ఎంక్వ‌యిరీలు వ‌స్తాయేమో చూడాలి. మెగాస్టార్ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు కాబ‌ట్టి, ఆ మేర‌కు క్రేజు నెల‌కొంటుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి చ‌ర‌ణ్ మైండ్‌లో ఏం ఉందో కాస్త వేచి చూడాల్సిందే. ప్ర‌స్తుతానికి అత‌డి మైండ్‌ లో ప్లాన్ -బి మాత్ర‌మే అమ‌ల్లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

Tags:    

Similar News