నా ప్రేమ మీకే అంటున్న చెర్రీ

Update: 2015-11-26 09:13 GMT
అంతవరకూ నా ప్రేమ నీకే.. ఈ డైలాగ్ వినగానే రామ్ చరణ్ గుర్తుకురావడం సహజం. కొంతకాలమే ప్రేమిస్తానంటూ ఆరెంజ్ సినిమాలో చెర్రీ చెప్పిన ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. నవంబర్ 26తో ఈ మూవీ రిలీజ్ అయ్యి, ఐదేళ్లు పూర్తైన సందర్భంగా.. చెర్రీ ఆ సంగతులు గుర్తు చేస్తూ పాత జ్ఞాపకాలను పోస్ట్ చేశాడు.

సాధారణంగా ఏదన్నా మూవీ డిజాస్టర్ గా మిగిలితే.. దాన్ని మర్చిపోయేందుకు ట్రై చేస్తారు స్టార్లు. కానీ అట్టర్ ఫ్లాప్ అనిపించుకున్న ఆరెంజ్ ని.. రామ్ చరణ్ మళ్లీ గుర్తు చేసుకుంటుండడం విశేషమే. తన మనసుకు బాగా నచ్చిన మూవీ ఇది అంటున్నాడు చెర్రీ. కంటెంట్ పరంగా రిచ్ గానే ఉన్నా.. మగధీర తర్వాత రిలీజ్ కావడం ఆరెంజ్ కు అతి పెద్ద మైనస్ పాయింట్. దీంతోపాటు స్టోరీని నేరేట్ చేసిన విధానం కూడా కన్ ఫ్యూజన్ గా అనిపిస్తోంది. వీటితోపాటు జెనీలియా చేసిన ఓవర్ యాక్షన్ కూడా డ్రా బ్యాక్ అంటారు సినీ లవర్స్.

ఇక చరణ్ నుంచి ఆశించే యాక్షన్ సీన్స్ లేకపోవడం, ఎమోషన్ సీన్స్ కి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఆరెంజ్ ఫ్లాప్ కి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. రిలీజ్ వెంటనే వచ్చిన విపరీతమైన నెగిటివ్ టాక్ కారణంగా మూవీ చతికిలబపడింది. నిర్మాత నాగబాబును నిలువునా ముంచేసిందని కూడా చెబుతారు. ఆరెంజ్ కారణంగా వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి.. రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేశాడు. అంతేకాదు చిరంజీవి - పవన్ కళ్యాణ్ లు కూడా ఆర్థికంగా సాయం చేశాకే.. ఆయన ఒడ్డున పడ్డాడు.

కానీ ఆ తర్వాత మాత్రం టీవీల్లో ప్రదర్శించినపుడు మంచి వ్యూయర్ షిప్ సాధించింది. మెస్మరైజింగ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ సీన్స్ కారణంగా.. బుల్లితెరపై మాత్రం ఆరెంజ్ సందడి బాగానే చేస్తోంది. ఇప్పుడీ మూవీ రిలీజ్ అయ్యి ఐదేళ్లు అయిన సందర్భంగా తనకు నచ్చిన మూవీని మరోసారి గుర్తు చేసుకున్నాడు రామ్ చరణ్. అంత వరకూ నా ప్రేమ మీకే అంటూ ఫినిషింగ్ కూడా ఇచ్చాడు.
Tags:    

Similar News