రామ్ గోపాల్ వర్మను చూస్తే సినిమా తీయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఆయనకో ఐడియా రావడం ఆలస్యం.. అసిస్టెంట్లను.. రైటర్లను పురమాయిస్తాడు. వాళ్లు ఓ లెవెల్ కు స్క్రిప్టు తయారు చేస్తే చాలు.. ఆయన తన స్టయిల్లో ఓ నెల రోజుల్లో సినిమా తీసి అవతల పడేస్తాడు. వర్మ ఓ సినిమా అనౌన్స్ చేయగానే ఆయన కోరుకున్న సమాచారం వచ్చి ముందు వాలిపోతుంది. ఐతే సినిమాలో కంటెంట్.. జయాపజయాల సంగతి మాత్రం మాట్లాడకూడదు. వర్మ ఇందులో ఎన్ని మనసు పెట్టి తీస్తున్నాడన్నది ఆయనకే తెలియాలి. ఐతే వర్మ బాగా కనెక్టయ్యే కొన్ని సినిమాల మీద మాత్రం ఆయన బాగానే ఫోకస్ పెడతాడు. ఈ మధ్య వచ్చిన ‘కిల్లింగ్ వీరప్పన్’ ఆ కోవకే చెందుతుంది.
తాజాగా ‘వంగవీటి’ కోసం కూడా వర్మ చాలా సమయమే పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం 80 రోజులు పనిచేశాడట వర్మ. ఇప్పటికి పూర్తయింది 60 శాతం షూటింగేనట. ఇంకా 40 శాతం మిగిలే ఉంది. మరో రెండు నెలలైనా వర్మ ఈ సినిమా కోసం కేటాయిస్తాడంటున్నారు. ‘రక్త చరిత్ర’ తర్వాత వర్మ ఎక్కువ టైం పెడుతున్నది.. ఎక్కువ కష్టపడుతున్నది ‘వంగవీటి’ కోసమే అంటున్నారు. ప్రి ప్రొడక్షన్ వర్క్ కోసమే వర్మ చాలా సమయం కేటాయించాడట. తీవ్ర వివాదాస్పద అంశాలతో ముడిపడ్డ సినిమా కాబట్టి.. వర్మ కొంచెం జాగ్రత్త పడుతున్నాడట. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు వర్మ.