లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ప్లస్సు మైనస్సు

Update: 2019-03-20 08:51 GMT
కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని ఇంకో వారంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేస్తామని వర్మ నిన్న ప్రకటించాడు. 29 అంటూ మరోసారి హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఇంకో వారం రోజులు ఆగితే సస్పెన్స్ కు తెరవీడుతుంది. అయితే చివరి నిమిషం దాకా ఏది నమ్మలేని పరిస్థితి అయితే నెలకొంది. గతంలో ఇలాంటి ఉదంతాలు వచ్చినప్పుడు ఉదయం మొదటి ఆట పడకుండా ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ ఏపీలో బ్రేక్ పడినా తెలంగాణతో పాటు మిగిలిన చోట్ల రిలీజ్ చేసేందుకు వర్మ రెడీగా ఉన్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి.

ఇదిలా ఉంచితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కున్న ప్లస్సులు మైనస్సులు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ముందుగా పాజిటివ్స్ తీసుకుంటే  కొంత కాలంగా నీరసంగా బాక్స్ ఆఫీస్ కు ఎంతో కొంత ఉత్సాహం తెచ్చే సినిమాగా దీని మీద ఎన్నికల వేళ అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్లు రెండూ మంచి స్పందన దక్కించుకోవడం విశేషం. చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు వర్మ పదే పదే చెబుతున్నాడు కాబట్టి మరోరకంగా ఆసక్తి కూడా నెలకొంది. అంచనాలు సగం అందుకున్నా చాలు సేఫ్ అయిపోతుంది

ఇక భయపెట్టే విషయాలకు వస్తే ఇందులో పాత్రల మీద క్రేజ్ ఉంది కానీ యాక్టర్స్ మీద ఒక్క శాతం కూడా లేదు. ఎన్టీఆర్ కీలక పాత్రధారి సహా ఎవరూ ప్రేక్షకులకు తెలిసినవాళ్ళు కాదు. చాలా మంది నటనకు మొదటిసారి అనిపించేలా ఉన్నారు. రేపు రెండు గంటల సేపు హాళ్లలో కూర్చోబెట్టాలి అంటే వీళ్ళ పాత్ర చాలా కీలకం. వర్మ టేకింగ్ మీద గొప్ప నమ్మకాలూ లాంటివి ఏమి లేవు కానీ అగస్త్య మంజు అనే మరో దర్శకుడు తోడుండటంతో అతను కేర్ తీసుకుని ఉంటాడనే టాక్ అయితే ఉంది.

సో ఈ రెండు బాలన్స్ చేసుకుని లక్ష్మిస్ ఎన్టీఆర్ కనక మంచి టాక్ తెచ్చుకుంటే మజిలీ వచ్చే దాకా వసూళ్లతో మేనేజ్ చేసుకుని ఈజీగా సేఫ్ అవ్వొచ్చు.కానీ పబ్లిసిటీ హంగామా తప్ప అసలు కంటెంట్ లో మ్యాటర్ ఉండదనే  విమర్శను ప్రతిసారి అందుకుంటూనే ఉన్న వర్మ ఈ సారి వాటిని బద్దలు కొడతాడా చూడాలి
Tags:    

Similar News