వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించని ‘భైరవ గీత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా మీటూ ఉద్యమం గురించి వర్మ తనదైన శైలిలో స్పందించాడు. మీటూ ఉద్యమంపై మీ స్పందన ఏంటని విలేకరి ప్రశ్నించిన సమయంలో గట్టిగా నవ్వేసిన వర్మ అందులో నా పేరు తప్ప అందరి పేరు రావడం విచిత్రంగా ఉందని పేర్కొన్నాడు.
గతంలో నా గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అందుకే మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు నా పేరును మీడియా ముందుకు తీసుకు వస్తారని అంతా ఊహించారు. కొందరు వర్మ పేరు మీటూలో రావాలని కూడా కోరుకున్నారు. కాని నా పేరు తప్ప అందరి పేర్లు వచ్చాయి. మీటూ ఉద్యమంలో ఇప్పటి వరకు నా పేరు రాకపోవడం కొంతమందికి పెద్ద షాక్ అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. నేను పొద్దున లేస్తే తొడలు, ఇంకా అవి ఇవి మాట్లాడుతూ ఉంటాను. అయితే నాకు దొరికిన వారు అంతా కూడా నేను పవిత్రుడిని అని నమ్మే వారే దొరికారు. కాని నేను మాత్రం అలా కాదని వర్మ నిర్మొహమాటంగా చెప్పేశాడు.
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరిపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించిన సమయంలో ఆ విషయం, వారి గురించి ఇప్పుడు చర్చ వద్దులేండి అంటూ సున్నితంగా తిరష్కరించాడు. ఇక వర్మ భవిష్యత్తులో వరుసగా నిర్మాతగా సినిమాలు చేస్తాడట. దర్శకుడిగా కొనసాగుతూనే నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ - కొత్త వారికి అవకాశాలు ఇస్తానంటూ వర్మ పేర్కొన్నాడు. ‘భైరవ గీత’ చిత్రం ఒక విభిన్నమైన ప్రేమ కథ అని - తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను వర్మ వ్యక్తం చేశాడు.