వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. అలాంటి వర్మ కంటికి ఏది కనిపించినా అది తెరమీద చూపించడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. వస్తువు దగ్గర నుండి మనుషుల వరకు దేన్నీ వదలడు. ఇటీవలే ‘మర్డర్’అనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన వర్మ అదే రోజు ఒక తండ్రి కూతురు ఆనందంగా ఉన్న పోస్టర్ రిలీజ్ చేసాడు. పైగా మర్డర్ అనే టైటిల్ పెట్టి కుటుంబ కథా చిత్రమ్ అని ఉపశీర్షిక పెట్టాడు. ఫాదర్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఆ టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పోస్టర్లో సూర్యాపేట ప్రణయ్ భార్య అమృత.. ఆమె తండ్రి మారుతీరావుల పాత్రలే అంటూ ప్రచారం జరుగుతున్న పాత్రలను పరిచయం చేశాడు. ఆ వివాదం అలా ఉండగానే తాజాగా మర్డర్ మూవీ నుండి మరో పోస్టర్‌ను ఆర్జీవీ విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో అమృత తన కొడుకును ఎత్తుకుని ఉంది. అంతేకాకుండా అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన భావోద్వేగానికి ఫిదా అయ్యానని కూడా ఆర్జీవీ ట్వీట్ చేయడం విశేషం.
ఇదిలా ఉండగా.. ఫాదర్స్ డే సందర్భంగా మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘ఓ తండ్రి తన కుమార్తెను ఎక్కువ ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను విడుదల చేస్తున్నాను’ అని ఆర్జీవీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘మర్డర్ అనేది మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ’ ‘అతి ప్రేమే అతి ద్వేషానికి కారణమవుతుందని.. తీవ్ర హింసకు దారి తీస్తుందని" పేర్కొంటూ వరుస ట్వీట్లు చేసి సంచలనం సృష్టించాడు. ఇక ఆర్జీవీ సమర్పణలో వస్తున్న సినిమాను నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తుండగా ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తోంది.