వాణీ విశ్వ‌నాథ్ కు వ‌ర్మ కౌంట‌ర్ అదిరిందిగా!

Update: 2017-10-13 17:16 GMT
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెర‌కెక్కిస్తాన‌న్న‌ వ‌ర్మ‌పై టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు - కార్య‌క‌ర్త‌ల నుంచే కాకుండా టీడీపీలో చేర‌బోతున్న వారి నుంచి కూడా వ‌ర్మ‌కు బెదిరింపులు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో టీడీపీలో చేరుతానని ప్రకటించిన హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్...వ‌ర్మ‌కు వార్నింగ్ ఇచ్చారు. తెలుగు ప్రేక్ష‌కులు దేవుడిగా భావించే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమా తీస్తే  వర్మ ఇంటి ముందు ధర్నా చేసే తొలి వ్య‌క్తిని తానేన‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అనుకున్న‌ట్లుగానే వాణీ విశ్వనాథ్  హెచ్చరికకు వర్మ త‌న‌దైన శైలిలో అదిరిపోయే రిటార్ట్ ఇచ్చారు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వాణీ విశ్వ‌నాథ్ కు వ‌ర్మ ఘాటుగా బ‌దులిచ్చారు. వ‌ర్మ ఫేస్ బుక్ పోస్టులు య‌థాతధంగా.....

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వాణి విశ్వనాథ్

ఎన్టీఆర్ వీరాభిమానిగా - ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా. ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా

నా Reply:

వాణి గారు - నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా....అప్పుడు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?

టీడీపీ నేత‌లు - మంత్రి సోమిరెడ్డి - ఎమ్మెల్యే అనిత ల వ్యాఖ్య‌ల‌కు వ‌ర్మ త‌న‌దైన శైలిలో అదిరిపోయే రిటార్ట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ కౌంట‌ర్ ఇచ్చిన త‌ర్వాత వారెవ‌రూ మ‌ళ్లీ స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో వాణీ విశ్వ‌నాథ్ కు వ‌ర్మ దిమ్మ‌దిరిగే రిటార్ట్ ఇచ్చారు. మ‌రి టీడీపీలో ఫైర్ బ్రాండ్ కావాల‌ని క‌ల‌లుగంటున్న అల‌నాటి అందాల తార....వ‌ర్మ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News