ఓవర్సీస్ లో సైడు గురు!

Update: 2018-10-22 06:07 GMT
మొన్న గురువారం విడుదలైన హలో గురు ప్రేమ కోసమే ఓవర్సీస్ లో ఆశించిన దూకుడు చూపించడం లేదు. రీజనబుల్ రేట్లకే అమ్మినా ఫైనల్ గా అక్కడి డిస్ట్రిబ్యూటర్ కు నష్టాలు తప్పనని ట్రేడ్ రిపోర్ట్. నిజానికి ఇలాంటి ఫామిలీ బేస్డ్ లవ్ స్టోరీస్ కి అక్కడ మంచి ఆదరణ ఉంటుంది. అఫ్ కోర్స్ కంటెంట్ బాగుండాలి అనే కండిషన్ మీదే లెండి. కానీ హలో గురు ప్రేమ కోసమే లో ఎంతో కొంత ఎంటర్ టైన్మెంట్ ఉన్నప్పటికీ ఫైనల్ గా అందరిని మెప్పించలేక యావరేజ్ కన్నా తక్కువ స్టాంప్ తోనే బయట పడేలా ఉంది.

 దిల్ రాజుకు యుఎస్ లో ఈ ఏడాది దక్కిన మూడో షాక్ అని చెప్పొచ్చు. లవర్ శ్రీనివాస కళ్యాణం తర్వాత ఇది కూడా అదే బాపతులోకి చేరిపోయింది. ఫ్యాక్షన్ సినిమాగా వచ్చినా త్రివిక్రమ్ మార్కు మేకింగ్ తో ఫైనల్ గా ఓవర్ సీస్ తో పాటు ఇక్కడ కూడా అరవింద సమేత వీర రాఘవనే విన్నర్ గా నిలిచింది. 2 మిలియన్ మార్కు దాటేసి స్టడీగానే ఉంది. ఇకపై వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడం మరో రెండు వారాల దాకా ఈ స్తబ్దతను కంటిన్యూ చేసేలా ఉంది. వీర భోగ వసంత రాయులు అంటూ ఏదో వెరైటీ పబ్లిసిటీ చేస్తున్నారు కానీ జనానికి కనెక్ట్ కావడంలో ఫెయిల్ అవుతోంది. రిలీజయ్యాక అద్భుతమైన కంటెంట్ ఉందని చూసిన కొందరు చెప్తే ఆ తర్వాత పికప్ అయ్యే ఛాన్స్ ఉందేమో కానీ ఇప్పటికైతే ఓపెనింగ్స్ కు సైతం గ్యారెంటీ లేదు.

మరోవైపు నాగ చైతన్య సవ్యసాచి కనక నవంబర్ మొదటి వారానికి కర్చీఫ్ వేసుకుంటే క్రేజ్ ఉన్న మూవీ కాబట్టి యుఎస్ లోనూ బాక్స్ ఆఫీస్ కు ఊపొస్తుంది. ఆ తర్వాత సర్కార్-తగ్స్ అఫ్ హిందుస్థాన్ తో మొదలుకుని టాక్సీ వాలాతో కంటిన్యూ అవుతూ 2.0 దాకా నవంబర్ ఫుల్ బిజీగా ఉంటుంది. అప్పటి దాకా ఎదురు చూపులు చూడటం తప్ప ఈ వారం టాలీవుడ్ సందడి లేనట్టే.
Tags:    

Similar News