భార్యలో దెయ్యాన్ని బయటకు తీస్తున్నాడు

Update: 2016-02-04 07:30 GMT
పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న కేరక్టర్లను చేయాలంటే.. ఇప్పుడు రమ్యకృష్ణ ఫస్ట్ ఆప్షన్ అయిపోతోంది. బాహుబలిలో శివగామి రోల్ తర్వాత ఈ సీనియర్ హీరోయిన్ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు తన భర్త కృష్ణవంశీ డైరెక్షన్ లో కూడా చేసేందుకు రమ్యకృష్ణ సిధ్ధమవుతోంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ కావడం విశేషం.

రుద్రాక్ష పేరుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. హారర్ ఫిక్షన్ ఫ్యాంటసీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సమంత లీడ్  హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రధానమైన పాత్రకు రమ్యకృష్ణను అడిగాడు దర్శకుడు. రోల్ నచ్చడంతో వెంటనే యాక్సెప్ట్ చేసింది ఈమె. ఈ పాత్ర ఓ దెయ్యం కావడం విశేషం. ఫిలిం ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా కొనసాగుతున్న రమ్యకృష్ణ వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. ఇంత కాలంలో ఎప్పుడూ దెయ్యం రోల్ ని పోషించని రమ్యకృష్ణ.. తొలిసారిగా దెయ్యంగా భయపెట్టబోతోంది.

రమ్యకృష్ణ అమ్మోరుగానూ ఒప్పించింది.. నీలాంబరిగా నీరాజనాలు అందుకుంది.. శివగామి  లాంటి పాత్రతో మెప్పించింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తనలోని భయపెట్టే దెయ్యం ట్యాలెంట్ ని బయటకు తీస్తోంది. ఇలా తన భార్యను దెయ్యంగా చూపిస్తోంది భర్త కృష్ణవంశీయే కావడం విశేషం.

Tags:    

Similar News