ఇద్దరు ప్రియుళ్ల మధ్య గొడవ రాజేసింది!

Update: 2015-07-02 13:30 GMT
ఈ అమ్మడికి టీజింగ్‌ అంటే మహా సరదా. వాలు చూపులతో వలలు వేస్తుంది. కొంటె తలపులతో కలల్లోకొస్తుంది. ఆ నడకతో, హొయలుతో చంపేస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న యువతరం ఈ అమ్మడి అందాలకు ఏనాడో ఫిదా అయిపోయారు. 20 నుంచి 60వయసు వరకూ ఫ్యాన్సున్నారు. అంతేనా ఈ భామ అంటే ఓ ఇద్దరు హీరోలు పడి చస్తారు. చెవులు కోసుకుంటారు. ఇదంతా ఎవరి గురించో ఈపాటికే అర్థమై ఉంటుంది. మీ ఊహకు అందే ఈ సుందరాంగి దీపికపదుకొన్‌.

    పొడుగు కాళ్ల సుందరి ఇప్పటికే ఇద్దరు హీరోలకు వలలు వేసింది. కుర్రహీరోలు రణబీర్‌ సింగ్‌, రణవీర్‌ సింగ్‌ ఇద్దరినీ కొంగున ముడేసుకుంది. రణబీర్‌తో చాలా కాలం ఎఫైర్‌ సాగించిన తర్వాత అనూహ్యంగా రణవీర్‌ లైన్‌లోకొచ్చాడు. ఇటీవలి కాలంలో రణవీర్‌ సరసన వరుసగా సినిమాల్లో నటిస్తోంది. రామ్‌ లీల చిత్రంలో ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ జనాలు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇంకేం ఉంది? రణవీర్‌తో చెట్టాపట్టాల్‌ అంటూ తిరిగేసింది. అంతేనా ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలోనే బాజీ రావ్‌ మస్తానీలో రణవీర్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రంలోనూ రామ్‌లీలను మించి ఘాటైన సన్నివేశాల్లో నటిస్తోంది. రణవీర్‌తో అదరచుంబనాలు, బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో నటిస్తోంది.

    ఈలోగానే ఓ కొంటె కుర్రాడు అడిగిన ఓ కొంటె ప్రశ్నకు సమాధనం ఇచ్చి అడ్డంగా బుక్కయిపోయింది. రణబీర్‌, రణవీర్‌ ఇద్దరిలో ఎవరితో ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బావుంటుంది? అన్న ప్రశ్నకు దీపిక షాకిచ్చే సమాధానం చెప్పింది. రణబీర్‌తో అయితేనే బెస్ట్‌. అనుష్క శర్మతో రణవీర్‌ రొమాన్స్‌ బెటర్‌ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఆ మాట విన్న రణవీర్‌కి ఉరేసుకున్నంత పనైంది. రణబీర్‌ నాకంటే బెస్టా? అంటూ రణవీర్‌ ఇప్పుడు గుర్రుమీదున్నాడు. తనతో ప్రేమాయణం సాగిస్తూనే రణబీర్‌ని దీపిక వెనకేసుకు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ రకంగా ఇద్దరి మధ్య గొడవ రాజేసింది పదుకొన్‌. రణబీర్‌  అంటేనే రణవీర్‌ సింగ్‌ మండిపడిపోతున్నాడిప్పుడు. దీపికను కొంటె పిల్ల అని కాదు, తుంటరి పిల్ల అనాలేమో!

Tags:    

Similar News