ప్రముఖ టీవీ యాంకర్ గురి చూసి సంధించిన బాణం ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో మునకలేసిన ప్రజల్లో చాలా మందికి గుచ్చుకుంది. తెలుగు ఫిలింసర్కిల్స్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలు గగ్గోలు పెట్టడానికి ఈ వ్యాఖ్యానం కారణమైంది. ఇంతకీ సదరు యాంకర్ ఎలాంటి బాణం విసిరింది? అది ఎవరెవరికి సూటిగా తగిలింది? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
హాట్ యాంకర్ కం నటి రష్మీ గౌతమ్ హింసను వ్యతిరేకిస్తూ ఒక వ్యాఖ్యను పోస్ట్ చేసింది. ఈ ప్రజలు ఇంకా ఎదగాలని పిచ్చి ఫైటింగులను ఆపాలని ట్విట్టర్ లో గుంబనగా ఒక పోస్ట్ చేసింది రష్మీ. అయితే ఇది ఎవరిని ఉద్ధేశించి చేసిన పోస్ట్ అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరికి ఈ సూచన? అని యువతరం ఆరాలు తీస్తున్నారు.
ఇది నిజానికి ఒక రామబాణం లాంటిది. హింసను ప్రేరేపించి రక్తపాతానికి కారణమయ్యే ఎలాంటి చర్యకు అయినా లేదా ఎలాంటి పోటీకి అయినా గురి పెట్టిన ఏకైక బ్రహ్మాస్త్రం అనడంలో సందేహం లేదు. అది గురి తప్పిందా తిరిగి వచ్చి యాంకర్ కే గుచ్చుకుందా? అన్నది అటుంచితే టైమ్ చూసి టైమ్ బాంబ్ నే పేల్చింది.
ఓవైపు టీవీ చానెళ్లు తిరగేస్తే గోదారి జిల్లాల్లో.. తెలుగు రాష్ట్రాల్లోను భారీ బెట్టింగులతో కోడి పందేలు సాగుతున్నాయని సంక్రాంతి ముసుగులో బడా బాబులంతా భారీగా పందేలు కాస్తూ డబ్బాట ఆడుతున్నారని కథనాలొస్తున్నాయి. ఇంకోవైపు తమిళనాడు ఆంధ్రా బార్డర్ లో జల్లికట్టులో కొన్ని ఎద్దుల కుమ్ముడుతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని కొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. ఒకరికి ఎద్దు కొమ్ము నడుము వెనక నుంచి గుచ్చుకుందని కథనాలొస్తున్నాయి.
నిజానికి కోడి పందేలు కానీ జల్లి కట్టు కానీ సాంప్రదాయ ఆటలు. వీటివల్ల రక్తపాతం జరిగినా అది నేరం కాదు. మెజారిటీ ప్రజల ఆకాంక్షను ఆపడం ఎవరి తరమూ కాదు. ఇలాంటివి ఆపడం పోలీసుల తరం కానీ మహామహుల తరం కానీ కాదు! ప్రభుత్వాలే పోరాడి ఓడాయి. కోర్టుల తీర్పులను ఖాతరు చేసే సన్నివేశం లేనే లేదు. అయితే ఇలాంటి సంక్లిష్ఠమైన సాంప్రదాయం పై తనదైన శైలిలో సూటిగా బాణం విసిరింది యాంకర్ రష్మీ గౌతమ్. అయితే ఇది కోడి పందేల్లో బెట్టింగులు కట్టే వాళ్లకు ఎద్దులతో జల్లి కట్టు పేరుతో పోటు పొడిపించుకునేవారికి అంతగా నచ్చకపోవచ్చు. కానీ ధైర్యం చేసినందుకు అభినందించాలి. ఎద్దుతో ఎవరు ఎలా పొడిపించుకుంటే మనకేం కావాలి? అని అంటారా లేదూ కత్తి పోటుతో పుంజు మెడ తెగితే ఆనక మసాలా పెట్టి వండేయడానికే కదా? అని సరిపెట్టుకుంటారా మీ ఇష్టం. రేష్మిని సమర్థించాలా విమర్శించాలా అనేది మీకు మీరుగా తీసుకోవాల్సి నిర్ణయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.