గత ఏడాది గీత గోవిందం విడుదలకు ముందు లీకైన సీన్స్ లో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల మధ్య లిప్ లాక్ కిస్ సినిమాలో ఉందన్న ప్రచారం కర్ణాటకలో పెద్ద సంచలనం రేపింది. దానికి కారణం అప్పటికే తనకు నటుడు కం దర్శకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ కావడమే. అతని ఫాన్స్ రష్మికను సోషల్ మీడియాలో భారీ ట్రాల్ చేశారు. దీని వల్లనో ఇంకే కారణమో కానీ మొత్తానికి చివర్లో వచ్చే బస్సు సీన్ లో దాన్ని తెలివిగా కవర్ చేసి మేనేజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అయ్యాక రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుంది.
తన మీద ఈ విషయంగా చాలా విమర్శలు వచ్చినప్పటికీ హుందాగా వాటికి బదులిచ్చి సైలెంట్ అయిపోయిన రష్మిక ఇప్పుడు మరోసారి డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండకు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదారు లిప్ లాక్ కిస్సులు ఇచ్చినట్టు ట్రైలర్ లోనే చూపించారు. దీని గురించి ప్రస్తావించినప్పుడు రష్మిక బదులు చెబుతూ కోపం ప్రేమ బాధ తరహాలో ముద్దు పెట్టుకోవడం కూడా ఒక ఎమోషన్ అని డియర్ కామ్రేడ్ లో కథ ప్రకారం అవి కావల్సినన్ని ఉన్నాయని నొక్కి చెప్పింది.
కావాల్సినన్ని అని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటో కానీ ఇది మాత్రం యాంటీ ఫాన్స్ కు కౌంటర్ గానే భావిస్తోంది కన్నడ మీడియా. డియర్ కామ్రేడ్ కన్నడలోనూ డబ్బింగ్ రూపంలో వెళ్తోంది. గీతం గోవిందం కేవలం తెలుగు వెర్షన్ కాబట్టి అక్కడి వాళ్ళు ఎంత మంది చూసుంటారో కానీ ఇప్పుడీ మూవీ ఎక్కువ జనానికి రీచ్ కావడం ఖాయం. కాబట్టి ఆ కోణంలోనే కావాల్సినన్ని ముద్దులు అని చెప్పిందేమో. మొత్తానికి కామ్రేడ్ సెన్సేషన్ కర్ణాటకలోనూ ఈసారి కాస్త గట్టిగానే ఉండేలా ఉంది