రెండో సినిమాకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఎవరైనా ఆ తర్వాత స్టెప్ చాలా ఆచీ తూచీ వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ హీరోకి మంచి కెరీర్ ఉంటుంది. అయితే హీరో కార్తికేయ మాత్రం అలా కాకుండా వరుస అపజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. అవును 'ఆర్ ఎక్స్ 100' ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా ఈ కుర్ర హీరో కి ఫ్లాపులు ఎదురయ్యాయి.
ఆర్ ఎక్స్ 100 తర్వాత కృష్ణ అనే తమిళ దర్శకుడితో 'హిప్పీ' అనే సినిమా చేసాడు. అదీ డిజాస్టర్ అయింది. వెంటనే ఓ డెబ్యూ డైరెక్టర్ తో 'గుణ 369' చేశాడు. అది పెద్దగా ఆడలేదు. కట్ చేస్తే ఇప్పుడు మరో డెబ్యూ డైరెక్టర్ శేఖర్ తో '90 ఎం ఎల్' చేసాడు. ఈ సారి కూడా బోల్తా కొట్టాడు. మొదటి షోకే సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చేసింది.
అయితే లేటెస్ట్ గా మళ్ళీ నెక్స్ట్ రెండు సినిమాలను ఇద్దరు కొత్త దర్శకులతోనే చేస్తున్నట్లు ప్రకటించాడు కార్తికేయ. నిజానికి కార్తికేయ ఇప్పటికే ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి తన మార్కెట్ ని దెబ్బ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తూ కెరీర్ ను పక్క ట్రాక్ పట్టిస్తున్నాడు. మరి ఈసారైనా కొత్త దర్శకులు కార్తికేయ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా హిట్ ఇస్తారేమో చూడాలి.