ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయడం అనేది ఇప్పుడు టాలీవుడ్ కల్చర్. 50 - 100 రోజుల ఫంక్షన్స్ అటకెక్కేసినప్పటి నుంచి వీటిపైనే ఇండస్ట్రీ దృష్టి పెట్టింది. చిన్నాచితకా సినిమాలకే ఆర్భాటంగా ఆడియో రిలీజ్ లు చేస్తున్న టైంలో.. అసలు అలాంటిదేమీ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి ఆడియో ఇచ్చిసి, కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు సరైనోడు. అయితే, దీనికి కాంపెన్సేషన్ అన్నట్లుగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ని ఈవెంట్ ని మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
ఈ నెల 10వ తేదీని విశాఖలో సరైనోడు పాటల విజయోత్సవం - ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనున్నాయి. అయితే.. హైద్రాబాద్ లో కాకుండా విశాఖలో ఈ వేడుక చేయడానికి కారణం.. సినీ ఇండస్ట్రీకి వైజాగ్ ఎంత ముఖ్యమో చెప్పేందుకే అని తెలిసింది. 'భారీ చిత్రాలకు సంబంధించిన పెద్ద పెద్ద కార్యక్రమమాలతోనే విశాఖలో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం అవుతుంది. ' అన్నారు నిర్మాత అల్లు అరవింద్.
ఈ ప్రెస్ మీట్ కి హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా.. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 'బాలకృష్ణ - రామ్ చరణ్ - రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి ఆశక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలు విభాగాలకు 16 ఎకరాలు కేటాయించాం. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సరైనోడు చిత్రం కోసం చేస్తున్న వేడుక ఆరంభం కావాలి' అన్నారు గంటా.