నేను ఏదైతే నమ్ముతానో, నేను ఏదైతే నిజం అనుకున్నానో దాన్నే ప్రేక్షకులు నమ్మే విధంగా, నిజం అనుకునే విధంగా సినిమాలో చూపించేందుకు ప్రయత్నిస్తాను అని, ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజుల్లో ఏం జరిగిందని తాను భావిస్తున్నానో దాన్నే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో చూపించబోతున్నట్లుగా రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. తన సినిమా విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత యుతంగా వ్యవహరించి విడుదలకు సహకరించాలని, ఆయన సహకారంతో ఈనెల 29న సినిమా విడుదల చేయాలని తాను ఆశిస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కాబోతున్న సందర్బంగా రామ్ గోపాల్ వర్మ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వర్మ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ గారి జీవితం సినీ నటుడిగా చాలా సాఫీగా సాగింది, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన జర్నీ బాగానే సాగింది. 1989లో ఓడిపోయాక ఆయన జీవితంలో ఒడి దొడుకులు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుండి ఆయన మరణించే వరకు సాగిన ఆయన జీవితంకు సంబంధించిన విషయాలు నాలో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. లక్ష్మీ పార్వతి ఎంట్రీకి సంబంధించిన విషయాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నాకు చాలా విభిన్నంగా అనిపించిన కారణంగా నేను వాటిని చూపించాలని భావించి ఈ సినిమాను తీశాను అన్నాడు.
నాన్న గారి బయోపిక్ తీయాలని నేను అనుకుంటున్నాను అంటూ బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అయ్యారు. అయితే నేను కాన్ ప్లిక్ట్ ఉంటేనే సినిమాను చేస్తాను అంటూ చెప్పాడు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వారిలో కొందరిని నాకు బాలకృష్ణ పరిచయం చేశారు. నా సినిమాకు సంబంధించిన సమాచారం అంతా కూడా నేను వారి నుండి తీసుకున్నాను. అందుకే ఈ సినిమా కథకు దోహదపడ్డ బాలకృష్ణ గారికి ఈ సినిమాను అంకితం చేయాలని భావిస్తున్నాను అంటూ వర్మ ప్రకటించాడు. మొత్తానికి వర్మ ఏం చేసినా విభిన్నంగా ఉంటుందని చెప్పేందుకు సినిమా అంకితం విషయం మరో నిదర్శణంగా చెప్పుకోవచ్చు. ఈనెల 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకు ఈ సినిమ వివాదం వెళ్తే విడుదల మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Full View