రవితేజ నటించిన కిక్2 రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇంటా బైటా ఈ సినిమా కంటెంట్ పై తీవ్రమైన కామెంట్లు వినిపించాయి. అయితే ఈ సినిమా లెంగ్త్ విషయంలో సురేందర్ రెడ్డి తన మాట వినలేదని, అందుకే రిలీజ్ తర్వాత ట్రిమ్ చేయాల్సొచ్చిందని రవితేజ సూటిగా ఆరోపించాడు. ఎక్కువ లెంగ్త్ వల్ల సినిమాలో క్రిస్ప్ పోయిందని ముందే చెప్పినా అతడు తన మాట వినలేదని రవితేజ అన్నాడు.
అయితే మాస్ రాజా ఇలా ఏనాడూ ఓ దర్శకుడి గురించి మాట్లాడిందే లేదు. అతడి మెంటాలిటీ చాలా సాఫ్ట్. మెచ్యూర్డ్ పర్సనాలిటీ. ఒకరిని ఇంత పబ్లిగ్గా విమర్శించే టైపు కాదు. కానీ ఇప్పుడిలా ఎందుకు బరస్ట్ అవ్వాల్సొచ్చింది? అని కారణం వెతికితే .. కిక్2 ఎలానూ ఫ్లాపైంది. ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి పబ్లిసిటీ పెంచితే కలిసొస్తుందని రవితేజ భావించి ఉంటాడని అనుకుంటున్నారు. అతడు ఆ మాటల్ని ఏదో క్యాజువల్‌గానే అని వదిలేశాడని అనుకోలేం. ఇంటెన్షన్ తోనే అలా అన్నాడు. పబ్లిసిటీ కోసమేనని అనుకుంటున్నారంతా.
రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన దర్శకుడు తనే అన్నీ చూసుకుంటాడులే అనుకున్నాం అని పూర్తిగా సురేందర్ రెడ్డి పైకి నెట్టేశారే కానీ, అసలు ఈ సినిమా తెరకెక్కేటప్పుడే కాన్సెప్టు ఏంటో అందరికీ చెప్పి తీశాడు. ఈ బాధ్యత అందరిదీ అని ఎవరూ అనకపోవడం హాస్యాస్పదం.