సురేష్‌ బాబు సినిమాలెందుకు తీయట్లేదు?

Update: 2016-08-24 13:52 GMT
నిజానికి ప్రొడ్యూస్ సురేష్‌ బాబు దగ్గరకు వెళ్ళి కథలు చెప్పాలంటే ఎవరైనా కూడా జంకుతారు. ఆయనకు కథ చెబితే మార్పులు చేయించీ చేయించీ ఇబ్బంది పెడతాడని అంటారు. ఇదే విషయం ఒప్పుకున్న ఆయన.. అసలు తాను సినిమాలు ఎందుకు చేయట్లేదో వివిరంచేశాడు కూడా.

''ఎవరు కథను చెప్పినా కూడా నమ్మలేకపోతున్నా. ఇలా ఉంటే హిట్టవ్వదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అందుకే లేటవుతోంది. అందుకే భయం వేసి చాలా సినిమాలను చివరకు వచ్చాక కూడా ఆపేస్తుంటా. రానా విషయంలో ప్రాక్టికల్ గా కూడా చూశాను. పూరి జగన్ కథ బాలేదు కదా అన్నా.. మావాడేమో చేసేశాడు.. కాని సినిమా ఫ్లాపు (నేను నా రాక్షసి మూవీ). అలాగే 'నా ఇష్టం' సినిమా కథ ముందు నేను రిజక్ట్ చేసిందే.. కాని రానా చేశాడు. అది కూడా ఆడలేదు. క్రిష్‌ తీసిన కృష్ణం వందే జగద్గురుమ్ నేను తీయాల్సిందే. కాని నేను ఎక్కువగా మార్పులు చేర్పులు చెబుతానేమోనని క్రిష్‌ వద్దన్నాడు. తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు. సినిమా ఏదో అలా ఆడింది. నేను చెప్పిన మార్పులు చేసుంటే.. ఇంకా బెటర్ గా ఆడేది'' అంటూ సెలవిచ్చారు సురేష్‌ బాబు.

ఇలా కథ కరక్టా కాదా అనే భయంతో ఆయన సినిమాలు చేయలేకపోతున్నారట. అందుకే ఏదైనా సినిమా ఎవరన్నా తీశాక నచ్చితే మాత్రం వెంటనే దానిని డిస్ర్టిబ్యూట్ చేస్తున్నారట. ఈ మద్యన వచ్చిన పెళ్ళి చూపులు సినిమాను ఆయనే పంపిణీచేశారు. అది సంగతి.
Tags:    

Similar News