మీ చెత్త పుకార్లను ఆపండి : రేణు దేశాయ్

Update: 2019-03-02 11:05 GMT
కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో ఒక వింత అరుదైన సంఘటన జరిగింది. ఒక వైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రైతలు సమస్యలను తెలుసుకుంటూ, వారిని ఆదుకుంటానంటూ పర్యటిస్తున్న సమయంలో మరో వైపు పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అదే జిల్లాలోని రైతుల సమస్యల గురించి సాక్షి టీవీ కోసం ఒక షో ను నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఒకే సారి పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ లు పర్యటించిన నేపథ్యంలో రాజకీయ మరియు మీడియా వర్గాల్లో పలు రకాల చర్చలు జరిగాయి.

ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ కు పోటీగా రేణు దేశాయ్‌ సాక్షి టీవీ షో పేరుతో పర్యటించిందని, పవన్‌ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు జగన్‌ అండ్‌ కో తో రేణు దేశాయ్‌ కలిశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సాక్షి టీవీ షో అంటూ కర్నూలుకు రేణుదేశాయ్‌ వెళ్లడం వల్ల ఈ వివాదం మరింతగా ముదిరింది. సాక్షి ఛానెల్‌ కాకుండా మరే ఛానెల్‌ అయినా కూడా ఇంతగా రచ్చ, చర్చ ఉండక పోయేది. ప్రస్తుతం సాక్షి అధినేత జగన్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌ లు రాజకీయ ప్రత్యర్థులు. అందుకే రేణు దేశాయ్‌ విషయంలో చర్చ సీరియస్‌ అవుతోంది. ఇలాంటి సమయంలో రేణు దేశాయ్‌ స్పందించింది.

రెండు నెలల క్రితం అనుకున్న కార్యక్రమం అది, వారం రోజుల క్రితం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఆ రోజు జరిగింది. నేను అక్కడకు వెళ్లే వరకు పవన్‌ కళ్యాణ్‌ గారు అదే జిల్లాలో రైతుల సమస్యల గురించి పర్యటిస్తున్న విషయం తెల్సిందే. నాకు ఆ విషయం తెలియగానే నా కొడుకుకు మీ నాన్నగారు, నేను ఒకే జిల్లాలో ఉన్నామంటూ మెసేజ్‌ పెట్టాను. ఇందులో కొందరు రాజకీయాలు గురించి మాట్లాడుకోవడం, ఇష్టం వచ్చినట్లుగా పుకార్లు క్రియేట్‌ చేయడం చేస్తున్నారు. నేను రాజకీయ పార్టీలో చేరానంటూ చెబతున్నారు. నేను ఏదైనా పార్టీలో జాయిన్‌ అయితే రహస్యంగా ఎందుకు ఉంచుతాను అంటూ రేణు చెప్పుకొచ్చింది. కొందరు పనీపాట లేని వారు పుకార్లను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ గారు, నేను ఒకే జిల్లాలో ఒకే సందర్బంలో పర్యటించడం అనేది యాదృశ్చికంగా జరిగింది. అంతే తప్ప ప్లాన్‌ చేసింది కాదు. నేను, పవన్‌ కళ్యాణ్‌ గారు ఒకే సమయంలో ఒకే విషయమై పర్యటించినంత మాత్రాన రాజకీయం ఎలా అవుతుందని రేణుదేశాయ్‌ ప్రశ్నించింది. ఒక మంచి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇలాంటి చిల్లర కామెంట్స్‌ ఏంటీ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో తాను రైతుల సమస్యలపై ఒక సినిమాను చేయాలనుకుంటున్నాను. అందుకే ఈ షోకు ఒప్పుకున్నాను. అంతే తప్ప రాజకీయాలు ఏమీ లేవని పేర్కొంది.
Tags:    

Similar News