స‌ల్మాన్ ని వెంటాడిన న‌ల్ల‌ జింక‌.. ఇప్ప‌టికి ఊపిరి పీల్చుకున్నాడు!

Update: 2021-02-12 09:43 GMT
కృష్ణ జింక‌ వేట కేసులో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ద‌శాబ్ధాల పాటు ఊపిరి తీసుకోని ప‌రిస్థితి త‌లెత్తిన సంగ‌తి అభిమానుల‌కు తెలిసిందే. అతడిని నీడ‌లాగా జీవితాంతం వెంటాడింది ఆ కేసు. జోధ్ పూర్ కోర్ట్ అత‌డికి అనుకూలంగా తీర్పును వెలువ‌రించ‌డంతో ఇన్నాళ్టికి ఊపిరి  పీల్చుకున్నారు. సోష‌ల్ మీడియాల్లో త‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచిన ప్రేమ కురిపించిన‌ అభిమానులకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

స‌ల్మాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ‌లో సల్మాన్ ఖాన్ ఉద్వేగంగా క‌నిపించారు. బ్లాక్ బ్లేజర్ ‌లో ఉత్సాహంగా కనిపిస్తున్న భాయ్  తన అభిమానులను ప్రేమ‌గా చురచురా చూస్తే.. వారి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ``నా అభిమానులందరికీ .. మీ ప్రేమ మద్దతు ఆందోళనకు ధన్యవాదాలు`` అనీ ఆయ‌న అన్నారు.

2003 లో కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో  స‌ల్మాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసిన జోధ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టు నుండి ఊపిరి పీల్చుకున్న ఉద్వేగం సల్మాన్ ఖాన్ లో క‌నిపించింది. ఆయ‌న తీర్పు వెలువ‌రించిన‌ న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో భాయ్ పై వచ్చిన పిటిషన్లు కొట్టివేశామ‌ని జ‌డ్జి రాఘవేంద్ర కచ్వాల్ సార‌థ్యంలోని బెంచ్ చెప్పిన వెంటనే ఎమోషనల్ ఖాన్ ``ధన్యవాదాలు సర్`` అని అన్నారు.

ఒక‌వేళ స‌ల్మాన్ దోషిగా నిరూపిత‌మైతే అతనిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 193 కింద కేసు నమోదయ్యేది. దీనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించాల్సి ఉంటుందని అతని న్యాయవాది హస్తిమల్ సరస్వత్ ఓ మీడియాకి చెప్పారు.

1998 లో `హమ్ సాథ్ సాథ్ హైన్` చిత్రం షూటింగ్ సమయంలో జోధ్ పూర్ సమీపంలోని కంకని గ్రామంలో రెండు కృష్ణ జింక‌ల్ని (బ్లాక్ బక్స్) వేటాడినందుకు ఖాన్ అరెస్టయ్యాడు. ఆ సమయంలో నటుడిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. అతని ఆయుధ లైసెన్స్ సమర్పించాలని కోర్టు కోరింది.

తాను లైసెన్స్ కోల్పోయానని ఖాన్ 2003 లో కోర్టులో అఫిడవిట్ సమర్పించాడు. దీనికి సంబంధించి ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ ‌లో ఎఫ్.‌ఐ.ఆర్‌ నమోదు చేశారు. ఏదేమైనా ఖాన్ ఆర్మ్ లైసెన్స్ కోల్పోలేదని కోర్టుకు తెలిసింది. కానీ పునరుద్ధరణ కోసం సమర్పించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ భాటియా అప్పుడు స‌ల్మాన్ పై కోర్టును తప్పుదోవ పట్టించే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఖాన్ పై దాఖలు చేసిన పిటిషన్లను జోధ్పూర్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రాఘవేంద్ర కచ్వాల్ గురువారం తీర్పులో తోసిపుచ్చారు.
Tags:    

Similar News